Super Cop: ఏదైనా న్యూస్‌ను బ్రేక్ చేయాలన్నా.. అంతా వ్యాప్తి చేయాలన్నా.. మంచైనా.. చెడైనా సోషల్ మీడియా ఎంతో చురుగ్గా పని చేస్తుంటుంది. ప్రజలకు నచ్చిన విషయాలు ఇట్టే వైరల్ అవుతూ ఉంటాయి. ప్రజలకు నచ్చిన వాళ్లు సెలెబ్రెటీలు అవుతూ ఉంటారు. తాజాగా, ఓ పోలీస్ కానిస్టేబుల్ ప్రజల్లో హీరో అయిపోయాడు. రాత్రికి రాత్రి పెద్ద సెలెబ్రిటీ అయిపోయాడు. అంతలా ఆయన ఏం చేశాడు అనుకుంటున్నారా?.. అయితే, వివరాల్లోకి వెళదాం రండి.. రాజస్తాన్‌లోని కరౌలీలో ఉగాది సందర్భంగా హిందువులు బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ సందర్భంగా ముస్లింలు ఎక్కువగా ఉండే ఏరియాలో వెళుతున్నారు.
ఈ నేపథ్యంలో మసీదు వద్దకు చేరుకుంటున్న టైంలో బైక్‌పై ఉన్న వాళ్లపై రాళ్ల దాడి జరిగింది. దీంతో ఆ ప్రాంతం రావణ కాష్టంగా మారింది. రెండు బైకులు, ఓ షాపును తగులబెట్టారు. ప్రస్తుతం గొడవ సద్దుమణిగింది. అంతా పోలీసుల కంట్రోల్‌లో ఉంది. ఈ అల్లర్లు జరుగుతున్న టైంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ ప్రమాదంలో ఉన్న ఓ చిన్నారితో పాటు ముగ్గురు మహిళలను కాపాడాడు. అతడు పాపను గుండెలకు అదుముకుని మంటల దగ్గర పరిగెత్తుతున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అతడి ధైర్య సాహసాలను అందరూ కొనియాడుతున్నారు. అతడి గురించి ఆరా తీయగా.. బైక్ ర్యాలీ జరుగుతున్న టైంలో అతడు బందోబస్తుకు వచ్చాడు.
గొడవ మొదలై రాళ్ల దాడి జరుగుతున్నపుడు అక్కడ రోడ్డుపై ఉన్న జనాల్ని కాపాడటం మొదలుపెట్టాడు. కాలుతున్న షాపు మధ్యలో ఉన్న ఇంట్లో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి చిక్కుకు పోయారు. అందులోని ఓ మహిళ చేతిలో చిన్నారితో ఉంది. ఆ దృశ్యం చూడగానే ఠక్కున అక్కడికి వెళ్లాడు. మంటలు డోర్‌ను చేరాయి. ఆ మహిళలు సహాయం చేయమని అతడ్ని ప్రార్థించారు. అతడు పాపను ఇవ్వమని అడిగి తీసుకున్నాడు. గుడ్డలో చుట్టిఉన్న పాపను గుండెలకు హత్తుకుని బయటకు పరిగెత్తాడు. వారిని కూడా తన వెనకాల ఫాలో అవ్వమన్నాడు. అలా అందరూ క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వైరల్: పేషంట్‌తో బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ వేసిన లేడీ డాక్టర్లు..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.