సుధా మూర్తి గురించి తెలియని వారుండరు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి. ఈమె ఫేమస్ రచయిత్రి, గొప్ప మానవతా మూర్తి. అలాంటి వ్యక్తి ప్రముఖ వ్యాపార వేత్త టాటాపై కోపం వ్యక్తం చేశారంట.
సుధా మూర్తి గురించి తెలియని వారుండరు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి. ఈమె ఫేమస్ రచయిత్రి, గొప్ప మానవతా మూర్తి. ఇటీవలే ఈమె అల్లుడు రిషి సునక్ బ్రిటన్ కి ప్రధాని అయిన సంగతి తెలిసిందే. సుధామూర్తి అనేక సేవా కార్యక్రమాలను చేస్తూ.. ఎంతో మంది పేద వారిని ఆదుకున్నారు. అలానే వివిధ కార్యక్రమాలతో, విషయాలతో సుధామూర్తి ఇటీవలే వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. తాజాగా టాటా సంస్థల అధినేత జేఆర్డీ టాటాపై సుధామూర్తి కోపంతో ఊగిపోయారంటా. ది కపిల్ శర్మ షోలో ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాక తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనల గురించి ఆమె వివరించారు.
ఇటీవలే కపిల్ శర్మ షోలో సుధామూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన జీవితం జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలను షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా జేఆర్‌డీ టాటాకు కోపంతో లెటర్ రాసిన ఉదంతం గురించి కూడ ప్రస్తావించారు. తాను చదువుకునే విశ్వవిద్యాలయంలోని నోటీస్ బోర్డులో ఒక ప్రకటన ఆమెకు కోపం తెప్పించింది. అందులో ఉద్యోగ కోసం అప్లికేషన్ పెట్టుకునేందుకు మహిళలకు అవకాశం ఇవ్వలేదు. దీంతో సుధామూర్తి ఆగ్రహంతో ఏకంగా టాటాకే లేఖ రాశారట. ఈ విషయాన్ని స్వయం ఆమెనే వెల్లడించారు.
షోలో ఆమె మాట్లాడుతూ” 1974లో నేను బెంగళూరులోని టాటా ఇన్‌స్టిట్యూట్‌లో ఎంటెక్ చేస్తున్నాను. ఒకరోజు నేను వసతి గృహం నుంచి తిరిగి వస్తుండగా కాలేజీ ప్రాంగణంలో నోటీస్ బోర్డులో ఒక ప్రకటన చూశాను. పుణెలోని టెల్కో ఉద్యోగం చేసేందుకు యువకులు కావాలని ఉంది. మంచి వేతనం కూడా ఉంటుందని ఉంది. అయితే చివర్లో యువతులు ఉద్యోగాలకు అప్లయ్ చేసేందుకు అవకాశం లేదని ఉంది. నాకు చాలా కోపం వచ్చింది. ఇక వెంటనే జేఆర్‌డీ టాటాకు లేఖ రాశారు. మహిళలకు అవకాశం ఇవ్వకపోతే.. మన దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందలేదని అన్నట్లు తెలిపారు”ఆమె తెలిపారు.
టాటా తన పుట్టిన రోజు జరుపుకునేందుకు ఏటా మార్చి 15న తమ కాలేజీకి వచ్చే వారని, భయంతో తాను టాటాను దూరం నుంచే చూశానని ఆమె చెప్పుకొచ్చారు. అయితే తాను రాసిన లేఖ టాటా గ్రూప్‌పై బాగానే పనిచేసినట్లు తెలిసింది. మహిళలకు అవకాశం ఉండదన్న ఆ పాలసీని తర్వాత టాటా గ్రూప్ తొలగించిందని, దానిపై సుధా మూర్తి ప్రభావం కూడా ఉందని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. మరి.. ఆమె తెలిపిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.