ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. అంత పెద్ద కంపెనీ అధిపతికి సతీమణి అయినా కూడా సుధామూర్తి గొప్ప రచయితగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో సేవాకార్యక్రమాల్లో పాల్గొని గొప్ప మహిళగా కీర్తింపబడ్డారు.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి అంటే దేశంలో తెలియని వారు ఉండరు. ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి సతీమణిగానే కాక ఆమె ఒక గొప్ప రచయిత్రి, సేవాకార్యక్రమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహిళ. అందుకే దేశం గర్వించదగ్గ ‘పద్మభూషన్’ పురస్కారం వరించింది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..
ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి ఎంత గొప్ప పొజీషన్ లో ఉన్నా ఆమె ఎంత నిరాడంబర స్త్రీమూర్తో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కోట్లాది రూపాయ డబ్బు, పలుకుబడి ఉన్నా.. సుధామూర్తి అత్యంత సాధాసీదాగా కట్టుబొట్టుతో మధ్యతరగతి మహిళగా సింపుల్ గా ఉంటారు. అంతేకాదు సుధామూర్తి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు స్వయానా అత్త కూడా. ఇటీవల బాలీవుడ్ టాక్ షో ‘ది కపిల్ శర్మ షో’ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి, తనకు మద్య జరిగిన లవ్ స్టోరీలో కొన్ని ఆసక్తికర్ సంఘటనల గురించి తెలిపారు. అలాగే తన సింప్లిసిటి.. వస్త్రధారణ కారణంగా యూకే వెళ్లినపుడు ఇమ్మిగ్రేషన్ అధికారుల వద్ద తనకు ఎదురైన వింత అనుభవం గురించి వివరించారు.
సుధామూర్తి మాట్లాడుతూ.. ‘ఆ మద్య నేను యూకే వెళ్లాను.. లండన్ ఎయిర్ పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్ అధికారులు నన్ను అడ్డుకొని మీరు ఎక్కడ ఉంటారు అని ప్రశ్నించారు.. అడ్రస్ రాయాలని కోరారు. నా కుమారుడు యూకేలోనే ఉంటాడు.. అతడి అడ్రస్ నాకు సరిగా జ్ఞాపకం లేదు.. నా అల్లుడు రిషి సునాక్ నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ అని అడ్రస్ రాశాను. అడ్రస్ చూసి ఇమ్మిగ్రేషన్ అధికారి నావైపు చూసి నవ్వాడు.. మేడమ్ మీరు జోక్ చేస్తున్నారా? అని అడిగారు.. లేదు నేను నిజమే చెబుతున్నా అని అతడితో అన్నాను. అప్పటికీ అతను నేను జోక్ చేస్తున్నా అని అనుకున్నాడు. నా కట్టూబొట్టూ వల్ల వాళ్లకు నన్ను ఓ సాధారణ మహిళలా భావించారు.. అందుకే ప్రధానికి అత్తనంటే నమ్మలేదు’ అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు.
ఇక తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ.. పెళ్లికి ముందు తనకు వచ్చే భర్త హీరోలా ఉంటాడు అనుకున్నానని.. నా పెళ్లి సమయంలో ఎంత బరువు ఉన్నారో.. ఇప్పటికీ ఆయన అంతే బరువు ఉన్నారని.. తనకు వంట సరిగా రాదు అంటూ నవ్వులు కురిపించారు. 1978 లో సుధామూర్తి, నారాయణమూర్తి వివాహం జరిగింది. వీరికి కుమార్తె అక్షత, కుమారుడు రోహన్ ఉన్నారు. అక్షత భర్త బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో పద్మభూషణ్ పురస్కరించారు. ఈ షోలో సుధామూర్తితో పాటు బాలీవుడ్ నటి రవీనా టాండన్, నిర్మాత గునీత్ మెంగా కూడా ఉన్నారు.