దేశంలో విద్యార్థులు చదువుకోవడం కోసం అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వాలు, ఇప్పటికీ పలు గ్రామాలకు సరైన రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నాయి. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో తమ పిల్లలను చదివించడం కోసం తల్లిదండ్రులు సాహసాలు చేయాల్సిన పరిస్థితి. ఇటీవల భారీ వర్షాలు రావడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అక్కడ పిల్లలను పాఠశాలకు పంపాలంటే ప్రతిరోజూ ప్రమాదకరమైన వాగు దాటించి పంపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వివరాల్లోకి వెళితే..
తమ పిల్లలను చదివించడానికి తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ దుర్భరమైన పరిస్థితులు మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా పేఠ్ తాలూకాలో నెలకొన్నాయి. ప్రతిరోజూ తమ పిల్లలను భుజాన వేసుకొని కాలువను దాటాల్సిన పరిస్థితి ఉంటుంది. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని, నదిలోకి బ్యాక్‌వాటర్ వదిలితే పాఠశాలలు బంద్ చేస్తారని స్థానికులు అంటున్నారు.
నది దాటడానికి బ్రిడ్జి నిర్మించాలని దశాబ్దాలుగా మొత్తుకుంటున్నా అధికారులు స్పందించడం అక్కడి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో రావడంతో నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH |Maharashtra: In absence of a bridge, group of children in Peth taluka, Nashik cross river every day to reach school
“River is deep but children have to go to school, so we carry them either on shoulders or in big utensils. We request admn to build a bridge,” says a local pic.twitter.com/rNmdPKD3lx
— ANI (@ANI) August 4, 2022