ఓ యూనివర్సిటీ నిర్వహించిన పరీక్షలో ఓ విద్యార్థి రాసిన సమాధానాలు నవ్వు తెప్పించగా.. సమాధాన పత్రాలు దిద్దిన లెక్చరర్ కామెంట్స్ అంతకుమించి ఉన్నాయి.
విద్యార్థులకు పరీక్షలు అనేవి కీలకమైనవి. ఏడాది పొడవు కష్టపడి చదివి.. పరీక్షలు రాస్తుంటారు. అయితే కొందరు మాత్రం పరీక్షలు అంటే ఓ రకమైన భయం ఉంటుంది. మరికొందరు మాత్రం పేపర్ నింపుతే చాలులే మార్కులు అవే వస్తాయి… అనే ధోరణిలో ఉంటారు. పరీక్షల్లో సినిమా స్టోరీలు, డైలాగ్స్ వంటి వాటిని సమాధానాలుగా రాసిన ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా ఓ విద్యార్థి ఏకంగా పాటలనే పరీక్షలో సమాధానంగా రాశాడు. అయితే అతడు రాసిన జవాబు పత్రాన్ని దిద్దిన లెక్చరర్ ఇచ్చిన కామెంట్స్ వింతగా నవ్వులు తెప్పించేలా ఉన్నాయి. ఈ ఘటన చండీగఢ్ యూనివర్సిటీలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పంజాబ్ రాష్ట్రంలోని చంఢీగడ్ యూనివర్సీటి పరిధిలో పరీక్షలు నిర్వహించారు. ఓ పరీక్షలో ఓ విద్యార్థి మూడు ప్రశ్నలకు సమాధానాలు రాశాడు. మొదటి సమాధానంగా త్రీ ఇడియాట్స్ సినిమాలోని పాటను రాశాడు. రెండో ప్రశ్నకు సమాధానంగా పేపర్ దిద్దే వారిని పొగుడుతూ రాసుకొచ్చాడు. “సార్ మీరు చాలా తెలివైన లెక్చరర్. నేను హార్డ వర్క్ చేయ్యలేకపోయాను. అది వందకు వందశాతం నా తప్పే. కానీ దేవుడు నాకు కొంత టాలెంట్ ఇచ్చాడు” అని రాసుకొచ్చాడు. ఇక మూడో ప్రశ్నకు సమాధానంగా పీకే సినిమాలోని ‘భగవాన్ హై కహాన్ రే తూ’ అనే పాటను సమాధానంగా రాశాడు.
ఇక అతడి జవాబు పత్రం దిద్దిన లెక్చరర్ షాకయ్యారు. కాసేపటి తరువాత తేరుకుని.. విద్యార్థికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మీరు మరిన్ని పాటలు సమాధానాలుగా రాయాలి అంటూ జవాబు పత్రంపై తన వ్యాఖ్య జోడించారు. “మీ ఆలోచన బాగుంది. కానీ ఇక్కడ ఇలాంటి అతి తెలివి పనులు పనిచేయవు” అని కామెంట్స్ రాశారు. ఎందుకంటే అన్ని ప్రశ్నలకు ఆ విద్యార్థి ఈ మూడు సమాధానాలే రాశాడు. మిగిలిన వాటికి రాయకపోవడంతో అతడి వ్యూహం ఫలించలేదంట.ఇక ప్రస్తుతం ఆ జవాబు పత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి.. ఇలాంటి విద్యార్థులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.