ఈ మద్య కొంత మంది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి రక రకాల పద్దతుల్లో హైటెక్ కాపీయింగ్ చేస్తున్నారు. భోపాల్‌లో జరిగిన ఎంబీబీఎస్ పరీక్షలో కూడా ఇలా చీటింగ్ చేస్తున్న విద్యార్థులు బయటపడ్డాడు. ఇందులో ఓ విద్యార్థి ఏకంగా ఈఎన్‌టీ సర్జన్ సాయంతో తన చెవిలో ఒక మైక్రో బ్లూటూత్ పరికరాన్ని అమర్చుకొని మరీ కాపీయింగ్ చేయడం అందరికీ షాక్ ఇచ్చింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పరీక్షల్లో చీటింగ్ కు పాల్పడటానికి ఏకంగా సర్జరీ చేయించుకుని చెవిలో మైక్రో బ్లూటూత్ పెట్టించుకుని పరీక్షలకు హాజరయ్యాడు ఓ విద్యార్థి. అదే సమయంలో దేవీ అహల్యాబాయి యూనివర్సిటీకి చెందిన తనిఖీ బృందం ఆ ఎగ్జామ్ సెంటర్‌లో తనిఖీలు చేసింది. సదరు విద్యార్థి పై అనుమానం రావడంతో తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా సదరు విద్యార్థిని వెతగ్గా.. అతని ప్యాంటు లోపల మరో జేబు ఉన్నట్లు వాళ్లు గుర్తించారు. దానిలో ఒక మొబైల్ ఫోన్ కూడా దొరికింది. ఆ మొబైల్ ఆన్ చేసి ఉండటం, అలాగే ఒక బ్లూటూత్ డివైజ్‌కు కనెక్ట్ ఉండటం అధికారులు గుర్తించారు. కానీ అతని వద్ద ఎలాంటి బ్లూటూత్ డివైజ్ దొరకలేదు. దీంతో ఆ విద్యార్థిని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయట పెట్టాడు.
ఇది చదవండి: భార్య స్నేహితురాలిని ఇంటికి పిలిచి.. భర్త దారుణం!
ఈ బృందానికి అహల్యాబాయి వర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్ రచన ఠాకూర్ నేతృత్వం వహించారు. కాగా, పట్టుబడిన విద్యార్థి గత 11 ఏళ్లుగా ఎంబీబీఎస్ చదువుతూనే ఉన్నాడు. కానీ ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. ఈసారి ఆ యువకుడికి చివరి అవకాశం కావడంతో ఎలాగైనా పాస్ కావాలని నిర్ణయించుకొని రిస్క్ తీసుకున్నాడు. పరీక్షలకు ముందే ఒక ఈఎన్‌టీ సర్జన్ సాయంతో తన చెవిలో ఒక మైక్రో బ్లూటూత్ పరికరాన్ని అమర్చుకొని పరీక్ష పాస్ కావాలని అనుకున్నాడు.. కానీ దురదృష్టం కొద్ది దొరికిపోయాడు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.