మన జీవితంలో కొన్ని సంఘటనలు ఎంతో సంతోషాన్ని ఇస్తుంటాయి.. అంతలోనే దుఖఃంలో ముంచేస్తాయి. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు జీవితాలు నాశనం అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత అరే ఇలా చేయకుండా ఉండాల్సిందే అని బాధపడ్డ సందర్భాలు ఎన్నో ఉంటాయి. కానీ ఒక చిన్న జాగ్రత్త తీసుకోవడం వల్ల మనకి తెలియకుండా వచ్చే ప్రమాదాల నుండి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం అని తమిళనాడుకి చెందిన ఒక వ్యక్తి తన కథను ఈ విధంగా పంచుకున్నాడు. ఈ కథ అందరిలో స్ఫూర్తి నింపడంతో పాటు కన్నీళ్లు తెప్పిస్తుంది.
జనవరి 7వ తేదీ దాదాపు సాయంత్రం సమయంలో నా భార్యతో బైక్ పై వెళ్తున్నాను. అదే సమయంలో వెనుక ఉన్న నా భార్య ఒక్కసారే కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లాను. అక్కడ డాక్టర్లు ఆమెకు సిటీ స్కాన్ చేసి మెదడు ఎడమ వైపు భాగం ఉబ్బుతోందని. ఇంక బతకడం కష్టం అని చెప్పారు. నేను హాస్పిటల్ నుండి నా భార్యని డిశ్చార్జ్ చేయించి వేరే ఆసుపత్రికి తీసుకువెళ్ళాను. అక్కడ ఆమెకు ఆపరేషన్ చేయించాను. అయితే ఆపరేషన్ చేసిన తర్వాత నా భార్య మెదడు క్రమంగా స్పందించడం తగ్గిపోయింది. అదే సమయంలో ఆమెకు ఐదో నెల.. కొన్ని రోజుల తర్వాత నా భార్య కోమలోకి వెళ్లిపోయింది. దురదృష్టం నన్ను వెంటాడుతూనే ఉది.. ఆమె కడుపులో ఉన్న నా కొడుకు కూడా లోకాన్ని చూడకుండానే కన్నుమూశాడు.
ఆ తర్వాత నా భార్యకు బ్రెయిన్ డెడ్ అని డాక్టర్లు చెప్పారు. దాంతో నా గుండె పగిలిపోయింది.. అప్పటి వరకు నా కంటి ముందు ఉన్న నా భార్య ఇక కనిపించదు అన్న నిజాన్ని తట్టుకోవడం కష్టంగా మారింది. అప్పటికే మేము అవయవ దానం చేయాలి అని ముందే నిర్ణయించుకున్నాం. దుఃఖం లోనే ఆర్గాన్ డొనేషన్ ఫార్మ్ మీద సంతకం చేశాను. జనవరి 13న నా భార్య నన్ను విడిచి అనంతలోకాలకు వెళ్ళిపోయింది. అయితే ఈ విషయం మొత్తం ఎందుకు చెబుతున్నాను అంటే.. వాహనాలు నడిపే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
బైక్ నడిపేటపుడు హెల్మెట్., కారు నడిపేటపుడు సీటు బెల్టు తప్పకుండా పెట్టుకోవాలని. లేకుంటే ప్రమాదాలు జరిగితే ఫలితాలు ఘోరంగా ఉంటాయి. నేను హెల్మెట్ పెట్టుకున్నాను కానీ నా భార్య హెల్మెట్ పెట్టుకోలేదు. తను కూడా హెల్మెట్ పెట్టుకుని ఉంటే ఇవాళ తనని కాపాడుకునే వాడిని. అందుకే జాగ్రత్త అనేది చిన్నదైనా పెద్దదైనా ముఖ్యమైనదే. తెలిసీ తెలియకుండా నేను అజాగ్రత్తగా ఉండటం వల్ల నా జీవితం అయిన నా భార్య ఉమ నాకు దూరం అయింది. కన్నీళ్లు దిగమింగుతూ.. తన భార్యతో చివరిగా దిగిన సెల్ఫీ ని పోస్ట్ చేశాడు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.