గురువారం దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో సీతారాముల వారికి పూజలు నిర్వహించారు. అలానే పెద్ద ఎత్తున మండపాలు ఏర్పాడు చేసి శ్రీసీతారాముల కళ్యాణం నిర్వహించారు. అయితే నవమి వేడుకల వేళ మధ్యప్రదేశ్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. మెట్ల బావి కూలి..35 మంది దుర్మరణం చెందారు.
గురువారం దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో సీతారాముల వారికి పూజలు నిర్వహించారు. అలానే పెద్ద ఎత్తున మండపాలు ఏర్పాటు చేసి.. శ్రీసీతారాముల కళ్యాణం నిర్వహించారు. రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అయితే గురువారం జరిగిన శ్రీరామ నవమి వేడుకలో వేళ మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. 50 అడుగుల లోతున్న బావిపై కప్పు కూలడంతో 35 మంది దుర్మరణం చెందారు. ఈ ఘోర ఘటన ఇండోర్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లో వెళ్తే..
గురువారం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లోని పటేల్ నగర్ లో బలేశ్వర్ మహదేవ్ జూలేలాల్ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించేందు భారీ ఏర్పాట్లు చేశారు. అంతేకాక భక్తులు కూడా పెద్ద సంఖ్యలో బలేశ్వర్ మహదేవ్ ఆలయానికి వచ్చారు. ఇక నవమి వేడుకల్లో భాగంగా హవనం నిర్వహించారు. ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆలయంలో ఉన్న 50 అడుగు మెట్ల బావి పై కప్పుపై భక్తులు నిల్చున్నారు.
అందరూ పూజ కార్యక్రమాలు నిమగ్నమై ఉండగా బావిపై ఉండే కప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో పై కప్పు నిల్చున్న దాదాపు 50 మంది భక్తులు బావిలో పడిపోయారు. ఈ ఘటనలో ఇప్పటివరకు దాదాపు 35 మంది మృతిచెందారు. మరో 18 మంది గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, అలానే మరో 19 మందిని కాపాడినట్లు ఇండోర్ నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎప్ బృందం ఘటనల స్థలానికి చేరుకుని నిచ్చెనల సాయంతో బావిలో పడిన వారిని కాపాడే ప్రయత్నం చేశారు.
అయితే బావిలో ఒకరిపై ఒకరు పడటంతో ఊపిరి ఆడక కొందరు, తీవ్ర గాయాలతో మరికొందరు మృతి చెందినట్లు స్థానికులు అంటున్నారు. ఇండోర్‌లోని మహదేశ్ జులేలాల్ ఆయంలో గురువారం శ్రీరామనవమి ఉత్సవాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఆలయంలో స్థలం లేకపోవడంతో వేడుకలను చూసేందుకు కొందరు భక్తులు గుడిలో ఉన్న 50 అడుగుల మెట్ల బావిపై కూర్చున్నారు. అయితే దానిపై బరువు అధికమవడంతో పురాతనమైన ఆ బావి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో సుమారు 50 మంది భక్తులు అందులో పడిపోయి.. ఈ ఘోరం చోటుచేసుకుంది.
ఈ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేలు ఆర్ఠిక సాయం ప్రకటించారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు ఇవ్వనున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అలానే మధ్యప్రదేశ్ సీఎంతో మోదీ మాట్లాడి.. ఘటన స్థలంలోని పరిస్థితుల గురించి సమీక్షించారు. మరి.. ఇలాంటి ఘటనలు జరగడానికి గల కారణల ఏంటనేది మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియలజేయండి.
Video | Rescue operation is on at Indore’s Beleshwar Mahadev temple. At least 25 people were feared trapped after the rooftop of a stepwell collapsed earlier today. pic.twitter.com/0gaPijoAeI
— Press Trust of India (@PTI_News) March 30, 2023