ఇటీవల దేశ వ్యాప్తంగా అధికార, ప్రతిపక్ష నేతలు భారీ బహిరంగ సభలు, ర్యాలీలు, పాదయాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను ఆకర్షించే పనిలో ఉన్నారు. సాధారణంగా బహిరంగ సభల్లో అప్పుడప్పుడు అపశృతులు డొల్లుతుంటాయి.. స్టేజ్ పై పరిమితికి మించిన ఎక్కడం వల్ల కుప్పకూలిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
దేశంలో రాజకీయాలు రోజు రోజుకీ వేడేక్కిపోతున్నాయి. రాబోయే ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు ప్రజలను ఆకర్షించేందుకు రక రకాల ప్రయత్నాలు మొదలు పెట్టారు. పాదయాత్రలు, ర్యాలీలు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. కొన్నిసార్లు భారీ బహిరంగ సభల్లో అపశృతులు జరుగుతుంటాయి. సభా వేదికపై పరిమితికి మంచి ఎక్కువగా నిలబడితే అది కాస్త కుప్పకూలిపోతుంది.. అలాంటి ఘటనే బిలాస్ పూర్ లో చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేతలు నిర్వహించిన భారీ బహిరంగ సభలో అపశృతి చోటు చేసుకుంది. వివవరాల్లోకి వెళితే..
2019 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కర్ణాటక కోలార్ లో ఓ సబా వేధికలో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా గుజరాత్ లోని సూరత్ కోర్టులో కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుపై నాలుగేళ్ల విచారణ తర్వాత మార్చి 23న పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చి శిక్ష విధించింది సూరత్ కోర్టు. దీంతో ప్రజా ప్రాతినిధ్యం చట్టం కింద రాహూల్ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. రాహూల్ గాంధీకి శిక్ష, అనర్హత వేటు పడటంపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ లోని బిలాస్ పూర్ లో ఆదివారం కాంగ్రెస్ నేతలు టార్చ్ ర్యాలీ చేపట్టారు.
గుజరాత్ లోని బిలాస్ పూర్ లో రాహూల్ గాంధీకి మద్దతుగా ఆదివారం కాంగ్రెస్ నేతలు టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అపశృతి చోటు చేసుకుంది. సభా వేదికపై పరిమితికి మంచి నాయకులు, కార్యకర్తలు ఎక్కడంతో బరువు ఆపలేక ఒక్కసారే కుప్పకూలిపోయింది. దీంతో స్టేజ్ పై ఉన్న ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కిందపడటంతో గాయాలయ్యాయి. కాకపోతే ఈ ఘటనలో ఎవరికీ ప్రాణహాని జరగలేదు. దీంతో అధికారుల, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు.. తర్వాత తేరుకొని ర్యాలీని యథావిధిగా గాంధీ చౌక్ నుంచి దేవకినందన్ చౌక్ వరకు టార్చ్ ర్యాలీని నిర్వహించారు. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్త వైరల్ అయ్యింది.
#WATCH | Chhattisgarh: Stage breaks down during torch rally organized by Congress to protest against termination of Rahul Gandhi’s membership of Lok Sabha in Bilaspur. (02.04.23) pic.twitter.com/PjnXREl5JN
— ANI (@ANI) April 3, 2023