ఇండియన్ రైల్వే శాఖ మనదేశంలోని అతి ప్రధానమైన వ్యవస్థలో ఒకటి. నిత్యం వేలాది మంది రైళ్ల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. రైల్వే శాఖ కూడా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకునే అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. అలానే రైళ్ల వేళలు, ఛార్జీలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు రైల్వే అధికారులు తెలియజేస్తుంటారు. తాజాగా నేడు పలు ప్రాంతాల్లో రైళ్లు రద్దైనట్లు అధికారులు తెలిపారు.
ఇండియన్ రైల్వే శాఖ మనదేశంలోని అతి ప్రధానమైన వ్యవస్థలో ఒకటి. నిత్యం వేలాది మంది రైళ్ల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. రైల్వే శాఖ కూడా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకునే అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. అలానే రైళ్ల వేళలు, ఛార్జీలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు రైల్వే అధికారులు తెలియజేస్తుంటారు. అలానే ఏవైన కారణాలతో రైలు రద్దైతే ప్రయాణికులను అలెర్ట్ చేస్తుంటారు. తాజాగా మరోసారి ప్రయాణికులను రైల్వే అధికారులు ముఖ్యమైన సమాచారం అందిచారు. నేడు అద్రా డివిజన్, ఖరగ్ పూర్ డివిజన్ లోని పలు మార్గాల్లో పలు రైలు రద్దయ్యాయి. మరి… ఆ రద్దైన రైళ్ల వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మన దేశంలోని కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో ప్రధానమైన వాటిల్లో రైల్వేశాఖ ఒకటి. ప్రయాణల కోసం ఎక్కువ మంది ప్రజలు ఉపయోగించేది రైళ్లనే. సామాన్య ప్రజలు అంతర్జిల్లా, అంతర్రాష్ట్ర ప్రయాణాల కోసం ఎక్కువగా రైల్వే ఆధారపడతారు. అందుకు తగ్గట్లే భారతీయ రైల్వే వ్యవస్థ కూడా ఎప్పటికప్పుడు తమ సేవల్ని మెరుగుపర్చుకుంటూ వెళ్తోంది. అలానే నిత్యం ప్రయాణికులకి కీలక సమాచారం అందిస్తుంది. రైల్వే ప్రయాణికులకు వాల్తేర్ డివిజన్ అధికారులు కీలక సూచనలు చేశారు. ఆయా మార్గాల్లో రద్దైన రైళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు. అద్రా డివిజన్ లోని అద్రా-చండిల్, ఖరగ్ పూర్ డివిజన్ లో ఖరగ్ పూర్-టాటా నగర్ సెక్షన్ లో ఆందోళనకారులో నిరసనలు చేపట్టారు.
అలానే ఆ మార్గాల్లో రైల్వే పట్టాల పైకి ఆందోళనకారులు వచ్చి చేరారు. దీంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. విల్లుపురం-పులియా(22606), తాంబరం-జాసిద్హి(12375), సాయినగర్ శిర్డీ-హావ్ డా(22893), హావ్ డా- జగదల్ పూర్(18005), అలెప్పుజ-ధన్ బాద్(13352) రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అలానే సికింద్రాబాద్ నుంచి విశాఖ వచ్చే జత రైలు ఆలస్యంగా నడుస్తుండడంతో విశాఖ-సికింద్రాబాద్(20833) వందే భారత్ ఎక్స్ ప్రెస్ శనివారం ఉదయం 5.45 గంటలకు బదులు 8.15 గంటలకు బయలుదేరేలా మార్పు చేసినట్లు వాల్తేర్ డివిజన్ రైల్వే అధికారులు తెలిపారు.