దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. గత నెల పది వేల వరకు నమోదు అయిన కేసులు ఇప్పుడు మూడు లక్షల మార్క్‌ను దాటాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటించింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో జనవరి 21 నుండి జనవరి 24 వరకు సికింద్రాబాద్ నుండి వెళ్లే ప్యాసింజర్ రైళ్లు, వేరే రాష్ట్రాల నుంచి సికింద్రాబాద్ వచ్చే 55 రైళ్లను రద్దు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నడిచే ఇంటర్‌సిటీ సర్వీసులతో పాటు, పొరుగు రాష్ట్రాలకు నడిచే ప్యాసింజర్ రైళ్లను ఎస్‌సీఆర్ రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు వెళ్ళవలసిన ప్యాసింజర్ రైళ్లు ఎక్కువగా ఉన్నాయి. సికింద్రాబాద్, కాజీపేట, బీదర్, కలబురిగి, నడికూడి, కాచిగూడ, కర్నూలు, మేడ్చల్, ఉందానగర్, తిరుపతి, కాట్పాడి, డోన్, గుంతకల్, గుత్తి, కర్నూలు సిటీ, రేపల్లె, తెనాలి, నర్సాపూర్, మచిలీపట్నం, గుడివాడ, బిట్రగుంట, చెన్నై సెంట్రల్‌కి నడిచే పలు ప్యాసింజర్ రైలు సర్వీసులను ఎస్‌సీఆర్ రద్దు చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇది చదవండి : ఆ స్పర్శ ఆహా.. అంటూ ప్రకాశ్ రాజ్ ఎమోషనల్ పోస్ట్!
సిబ్బంది, లోకో పైలెట్ల కొరతతో రైళ్లు రద్దు చేసినట్లు వార్తలు రావడంపై శుక్రవారం దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ స్పందించారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలోనే రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. అందుకే 55 రైళ్ల ను క్యాన్సిల్ చేసినట్లు తెలిపారు. సిబ్బంది, లోకో పైలెట్లు కొరతతోనే రైళ్ల రద్దు చేస్తున్నారన్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని ఆయన అన్నారు.
కరోనా మహమ్మారి కారణంగా @SCRailwayIndia ఈ నెల 21 నుండి 24 వరకు కొన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసింది. pic.twitter.com/Y5IF8kNGsD
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) January 21, 2022
(3/3) Cancellation of Passenger Trains from 21st to 24th January, 2022 @DRM_Secunderabad @DRMHYB @drmgtl @vijayawadascr @DRMGNT #IndiaFightsCorona #Unite2FightCorona pic.twitter.com/YOKhapawLX
— South Central Railway (@SCRailwayIndia) January 21, 2022