దేశంలోకి కరోనా మహమ్మారి ఎంటర్ అయినప్పటి నుండి ప్రజా జీవితం తలక్రిందులు అయిపోయింది. ఉద్యోగులు నిరుద్యోగులు అయ్యారు. చిన్నారులు అనాధలు అయ్యారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కి లక్షల్లో ఫీజ్ లు కట్టి రోడ్ మీద పడ్డ కుటుంబాలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు తమ రాజకీయాలు తాము చేసుకుంటూ పోయాయి. మొదటి వేవ్ కి, సెకండ్ వేవ్ కి మధ్యలో కావాల్సినంత సమయం దొరికింది. ఈ గ్యాప్ లో మన వైద్య సదుపాయాలు మెరుగు పరుచుకుని ఉంటే.. బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరత వచ్చి ఉండేది కాదు. కానీ.., మన ప్రభుత్వాలు ఆ దిశగానే ఆలోచించలేదు. పైపెచ్చు ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించారు. దీని కారణంగానే సెకండ్ వేవ్ లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. కానీ.. ఇంతటి క్లిష్ట సమయంలో కూడా ప్రజలకి అండగా నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అంతా సోనూసూద్ గురించే చెప్తారు.సోనూసూద్ సాయం వల్ల ఈరోజు ప్రాణాలు నిలబెట్టుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఎలాంటి స్వార్ధం ఆశించకుండానే సోను ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు.సంవత్సర కాలంగా సోనూసూద్ ప్రజలకి సేవ చేస్తున్నా.., ఎప్పుడు నాయకులను ప్రశ్నించలేదు. వారిని విమర్శించలేదు. కామ్ గా ప్రజలకి తనకి తోచిన సహాయం చేస్తూ వచ్చాడు. కానీ.., ఇప్పుడు మొదటిసారి సోనూసూద్ ఈ విషయంలో తన గళం విప్పాడు.
గతేడాదితో పోల్చితే దేశంలో ఇప్పుడు దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని, సరైన వసతుల్లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటే.. అది చూసి చలించిపోయానని సోనూ సూద్ అన్నారు. తమ కుటుంబ సభ్యులను, ఆప్తులను, ప్రియమైన వారిని కోల్పోయి ప్రతిరోజూ ఎంతో మంది కన్నీరు పెట్టుకుంటున్నారని.. ఈ పరిస్థితులు చూశాక తన తల్లిదండ్రులు సరైన సమయంలో కన్నుమూశారని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒకవేళ వాళ్లే కనుక ఇప్పుడు ఉండి ఉంటే.. వాళ్లు పడే ఇబ్బంది చూసి తన హృదయం ముక్కలయ్యేదని చెప్పారు. సాయం చేయడంలోనే అసలైన సంతోషం ఉందని తెలుసుకున్నానని, అందుకే లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు చేతనైనంత సాయం అందిస్తున్నామని సోనూ తెలిపారు. ఇక ఇప్పటికైనా రాజకీయ నాయకులందరూ ఒకరిపై ఒకరు బురద చల్లుకునే ప్రయత్నాలు మానుకొని ప్రజలకు సాయం అందించాలని ఆయన కోరాడు. కానీ.., ఇదే సమయంలో తనకి రాజకీయాలతో సంబంధం లేదని ప్రజల కష్టాలు తీరితే చాలని సోనూసూద్ అభిప్రాయపడ్డారు. దీనితో.., సోనూ కామెంట్స్ కి నెటిజన్స్ నుండి మద్దతు లభిస్తోంది. మరి.., సోనూసూద్ పొలిటీషియన్స్ పై చేసిన కామెంట్స్ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.