ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు సేవచేయడానికి ఎన్నుకోబడిన వారు. అలా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తుంటారు ప్రజాప్రతినిధులు. అయితే కొన్ని సందర్భాల్లో ప్రజలను నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇది కేవలం ఎమ్మెల్యేలకు మాత్రమే మంత్రులకు, ముఖ్యమంత్రికి సైతం నిరసనలు ఎదురవుతుంటాయి. తాజాగా తమిళనాడు ఆర్ధిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ కారుపై కొందరు భాజపా కార్యకర్తలు చెప్పులు విసిరారు. ఈ వ్యవహారంలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన మధురైలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
జమ్ముకశ్మీర్ లోని రాజౌరి జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో అమరుడైన రైఫిల్ మెన్ డి. లక్ష్మణన్ కు నివాళ్లర్పించేందుకు ఆర్థిక మంత్రి పళనివేల్ మధురై వెళ్లారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై సైతం వస్తుండంతో.. ఆయనకు స్వాగంత పలికేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. అయితే కలెక్టర్, ఇతర అధికారిక సభ్యులు మాత్రమే ఇందులో భాగం కావాలని మంత్రి పేర్కొన్నారు. అలా పాటించకపోతే మిలటరీ ప్రొటోకాల్ ఉల్లంఘన కిందకి వస్తుందని మంత్రి పళనివేల్ తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు జనాన్ని అదుపు చేసేందుకు యత్నించారు. భాజపా కార్యకర్తలను ఆ ప్రాంతం నుంచి తరలించాలని మంత్రి.. పోలీసులని ఆదేశించినట్లు ప్రచారం జరిగింది. దీంతో భాజపా కార్యకర్తలు ఒక్కసారిగా మంత్రికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.’
అమరుడైన రైఫిల్ మెన్ డి. లక్ష్మణన్ కు నివాళులర్పించిన అనంతరం మంత్రి తిరిగి వెళ్తుండగా.. ఆయన వాహనంపై చెప్పు విసిరారు. దీంతో అది కాస్తా సరాసరి వెళ్లి.. మంత్రి కారు డ్రైవర్స్ వైపు అద్దం మీద పడింది. దీంతో ఈ ఘటనకు కారకులుగా భావిస్తూ పోలీసులు ఐదుగురు భాజపా కార్యకర్తలను అరెస్టు చేశాచరు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.