లఖింపుర్ ఖేరీలో శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి కుమారుడి వాహన శ్రేణి వెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఆ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. ఆ తర్వాతి ఘటనల్లో మరో నలుగురు మృతి చెందారు. ఆ కేసులో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రా ప్రధాన నిందితుడు. ప్రస్తుతం సిట్ వెల్లడించిన విషయాలు అందరినీ షాక్ కు గురిచేశాయి. లఖింపుర్ ఖేరీ ఘటన వెనుక కుట్ర కోణం ఉందని వెల్లడించింది. ప్రణాళికా బద్ధంగానే ఆ కుట్ర జరిగినట్లు తెలిపింది. అంతే కాకుండా నిందితుడిపై నమోదు చేసిన అభియోగాలను సవరించాలంటూ అధికారులు న్యాయమూర్తికి లేఖ రాశారు.
Investigation team probing Lakhimpur Kheri violence says the incident was as per a “pre-planned conspiracy” which led to death of 5 people and left several injured
(file photo) pic.twitter.com/oAjYLQwF3V
— ANI UP (@ANINewsUP) December 14, 2021
ఈ కేసులో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు, మిగిలిన నిందితులు హత్య, కుట్రకు పాల్పడ్డారంటూ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అవే కాకుండా హత్యాప్రయత్నం, పలు అభియోగాలు అదనంగా జోడించాలని కోరారు. అసలు ఘటన ఏంటంటే.. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ లఖింపుర్ లో రైతులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు. రైతులపైకి కేంద్రమంత్రి కుమారుడు ఆశిశ్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లింది. ఆ ఘటన దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని పుట్టించింది. కేంద్రమంత్రిని తొలగించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ఈ కేసు విచారణలో యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. విచారణ వేగం పెంచాలని నవంబర్ లో సిట్ ను ఆదేశించింది. రైతులు వ్యతిరేకించిన సాగు చట్టాల రద్దు పార్లమెంట్ లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే.
Lakhimpur Kheri violence: SIT demands attempt to murder charges against 13 accused https://t.co/2RkCUVlc5o pic.twitter.com/HHVIjQeDuo
— The Times Of India (@timesofindia) December 14, 2021