ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆరోగ్యంగా ఉన్నవారి కంటే మరెవరు ధనవంతులు కారు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న అనుకోని వ్యాధులు, రోగాలు వచ్చి జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయి. తాజాగా ఓ ఇంట్లో అక్క, తమ్ముడికి అరుదైన వ్యాధి సోకింది. వారికి చికిత్స చేయించేంత డబ్బు ఆ కుటుంబానికి లేదు. దీంతో వారు దిక్కుతొచని స్థితిలో ఉండిపోయారు. అయితే తాను చనిపోయిన పర్వాలేదు.. తన తమ్ముడు బ్రతకాలని అనుకుంది ఆ అక్క. దీని కోసం తన వేదనను ప్రపంచానికి వీడియో రూపంలో తెలియజేసి.. డబ్బులు సేకరించింది. తమ్ముడికి చికిత్స చేయించి… ప్రాణాలు నిలబెట్టి ఆమె మరణించింది. ఈ విషాద ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…
కేరళలోని కన్నూర్ జిల్లాలో అఫ్రా రఫీక్ అనే 16 ఏళ్ల బాలిక తన కుటుంబంతో జీవిస్తుంది. ఆమెకు ఓ ఏడాదిన్నర వయస్సున తమ్ముడు ఉన్నాడు. ఆమెకు స్పైనల్ మస్క్యూలర్ అట్రఫీ(SMA) అనే వ్యాధి ఉంది. ఇదొక అరుదైన జన్యు వ్యాధి. దీనివల్ల కండరాలు బలహీనంగా మారిపోయి కదలికలు, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఈ వ్యాధి అనేది ప్రతీ 6000-10,000 మంది చిన్నారుల్లో ఒకరికి సంభవిస్తుంది. దీంతో కుటుంబ సభ్యులంత తీవ్రవేదనకు గురయ్యారు. ఇదే క్రమంలో అఫ్రా తమ్ముడికి కూడా ఈ వ్యాధి సోకింది. దీంతో ఆ కుటుంబ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఎందుకంటే ఈ వ్యాధితో వారి పాప అనుభవిస్తోన్న బాధ ఎలాంటిదో వారికి తెలుసు.
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఔషధాల్లో ఒకటైన ‘జోల్జెన్‌స్మా’ను ఈ వ్యాధి చికిత్సలో వాడతారు. రెండేళ్ల లోపు చిన్నారులకు దీన్ని అందిస్తారు. జోల్జెన్‌స్మా ఒక డోసు ధర రూ.17.47 కోట్లు. తాను భరిస్తోన్న బాధను తన తమ్ముడు కూడా అనుభవించడం తన ఇష్టం లేదు. వ్యాధి గురించి వివరిస్తూ..తన కుటుంబ పరిస్థితి వివరిస్తూ.. ఓ వీడియోను పోస్ట్ చేసింది. దాన్ని ఆన్‌లైన్‌లో ఉంచగా, కొద్ది సమయంలోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మీడియా దృష్టిలో పడింది. 2021లో ఆమె చేసిన ఒక వీడియో వైరల్‌గా మారింది. దీంతో దేశవ్యాప్తంగా ఆమెకు అభిమానులు ఏర్పడ్డారు. చికిత్స కు అవసరమైన డబ్బులు వారికి సమకూరింది. చికిత్స చేసి.. తమ్ముడిని కాపాడింది అఫ్రా.
ఆ తర్వాత, డబ్బులు పంపించడం ఆపేయాలంటూ అఫ్రా మరో వీడియో కూడా చేశారు. మరోవైపు ఆమె ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ దిగజారుతూ వచ్చింది. తిరువనంతపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. తమ్ముడి ప్రాణాలు కాపాడి.. ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. మరి.. ఈ విషాదకరమైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వీడియో: 30 సెకన్లలో రూ.35 లక్షలు కొట్టేసిన 8 ఏళ్ల బాలుడు!
ఇదీ చదవండి: యంగెస్ట్ సీఈవో..13 ఏళ్లకే 56 కంపెనీలకు బాస్!