దేశంలో నానాటికి వివాహా సంబంధాలు విభిన్నంగా మారుతున్నాయి. స్త్రీ, పురుషులే వివాహాలు చేసుకునే సంస్కృతి, సాంప్రదాయాల నుండి వినూత్నమైన పెళ్లిళ్లు తెరపైకి వస్తున్నాయి. తాజాగా బీహార్ లో ఓ పెళ్లి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
దేశంలో భిన్నమైన సంబంధ, బాంధవ్యాలు ఏర్పడుతున్నాయి. స్త్రీ, పురుషులే వివాహాలు చేసుకునే సంస్కృతి, సాంప్రదాయాల నుండి విభిన్నమైన సంబంధాలకు పరిస్థితులకు దారి తీస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా వివాహాలు జరుగుతున్నాయి. అంతే కాకుండా ఒకే జాతికి చెందిన వారూ వివాహాలు చేసుకుంటున్నారు. పురుషుడు, పురుషుడ్నే ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంటే, మహిళలు కూడా మహిళల్నే చేసుకుంటున్నారు. అటు ట్రాన్స్ జెండర్స్ సైతం.. వారి జాతికి చెందిన వారినే పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఇటీవల కాలంలో ఈ వివాహాలను దేశంలో చూస్తూనే ఉన్నాం. అయితే బీహార్‌లో చోటుచేసుకున్న ఓ స్టోరీ గురించి తెలిస్తే ఆశ్చర్యపోక మానరు.
బీహార్‌లోని సమస్తీపూర్ జిల్లా ధరహారా గ్రామానికి చెందిన శుక్లాదేవీకి 2013లో ప్రమోద్ అనే వ్యక్తితో పెళ్లి అయింది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే వీరి వద్దకు ఉండేందుకు ప్రమోద్ చెల్లి సోనీ దేవి వచ్చింది. ఈ క్రమంలో మరదలితో శుక్లాదేవీ ప్రేమలో పడింది. ఐదు నెలల క్రితమే వదిన మరదళ్లు వివాహం చేసుకున్నారు. భర్త కళ్లెదుటే వదిన, మరదళ్లు కాపురం చేయసాగారు. వీరి సంబంధాన్ని శుక్లాదేవీ భర్త ప్రమోద్ కూడా అంగీకరించారు. వీరంతా కలిసి జీవించడం మొదలు పెట్టారు. ఈ విషయం ఆ నోట, ఈ నోట చేరి.. సోనీదేవీ అక్క ఉషా దేవీకి తెలిసింది. అగ్గిలం మీద గుగ్గిలం అయిన ఉషాదేవీ పరుగుపరుగున సోదరుడు ప్రమోద్ ఇంటికి చేరుకుంది.
శుక్లాతో గొడవపడిన ఉషా, చెల్లి సోనీని బలవంతంగా ఇంటికి తీసుకెళ్లిపోయింది. దీంతో శుక్లా, తన భర్త ప్రమోద్, పిల్లలతో కలిసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఉషాదేవీ 10-15 మందితో తన ఇంటిపై దాడి చేసి తన మరదలు సోనీని బలవంతంగా తీసుకెళ్లిందని, తనను తాను వివాహం చేసుకున్నట్లు పేర్కొంది. శుక్లా ఈ విషయం చెప్పగానే పోలీసులు సైతం ఖంగు తిన్నారు. ఆమెను తిరిగి తమ వద్దకు పంపాలని వేడుకుంది. సోనీ అంటే తనకు చాలా ఇష్టమని, ఆమె లేకుండా జీవించలేదని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ రిలేషన్ షిప్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.