కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. పార్టీని విజయం అందిచడానికి ఎంత కష్టపడ్డారో.. సీఎం అభ్యర్థి ఎంపికకు కూడా అదే స్థాయిలో కష్టపడాల్సి వచ్చింది. తాజాగా ఈ ఉత్కంఠకు తెరపడింది.
కర్ణాటకలో జరిగిన అసెంబ్లి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. పార్టీని విజయం అందిచడానికి ఎంత కష్టపడ్డారో.. సీఎం అభ్యర్థి ఎంపికకు కూడా అదే స్థాయిలో కష్టపడాల్సి వచ్చింది. మే 13న కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అయితే అప్పటి నుంచి నేటి వరకు సీఎం అభ్యర్థి ఎవరో నిర్ణయించుకోలేక ఆ పార్టీ అధిష్టానం తంటాలు పడుతోంది. ఫలితాలు వెల్లడయిన నాటి నుంచి సీఎం సీటు కోసం సిద్ధ రామయ్య, డీకే శివకుమార్ మధ్య పోటీ కొనసాగుతుంది. వీరితో పార్టీ అధ్యక్షులు ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ సైతం పలుమార్లు భేటీ అయ్యారు.
కానీ సీఎం పదవి ఎవరిని వరిస్తుంది అనే విషయంలో అందరిలో ఉత్కంఠ కొనసాగింది. తాజాగా ఆ సీఎం ఎవరు ఉత్కంఠ తెరపడింది. కర్ణాటక సీఎంగా సిద్ధ రాయమయ్యను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. సాయంత్రంలోపే మల్లిఖార్జున ఖర్గే ఓ ప్రకటన చేస్తారని ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. రేపే సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. సిద్ధరామయ్యకే సీఎం పదవి అప్పగించే విషయాన్ని రాహుల్ గాంధీ.. డీకే శివకుమార్ కు స్పష్టం చేశారని తెలుస్తోంది.
దీనికి గల కారణం, డీకేకు సీఎం పదవి ఇవ్వకపోవటానికి గల కారణాలను అదిష్టానం.. డీకే తెలియజేసిందని పార్టీ వర్గాల సమాచారం. అయితే ఉపముఖ్యమంత్రి పదవి విషయంపై శివకుమార్ తో రాహుల్ చర్చించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అలానే సిద్ధరామయ్య ప్రభుత్వం డీకే శివకుమార్ కు ప్రాధాన్యత ఉండేలా అధిష్టానం కసరత్తు చేస్తుంది. గతంలోను కర్ణాటక సీఎంగా సిద్ధ రామయ్య పని చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కర్ణాటక సీఎం సీటుపై సిద్ధరామయ్య కూర్చోనున్నారు. మరి.. సిద్ధరామయ్యను సీఎంగా ఎంపిక చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.