మహారాష్ట్రలోని మతపరమైన పర్యాటక ప్రదేశం షిర్డీలో మే 1 నుంచి నిరవధికంగా బంద్ చేయనున్నారు. ఆలయ ట్రస్ట్, మహారాష్ట్ర పోలీసులు తీసుకున్న ఓ నిర్ణయం ఈ బంద్ కి ప్రధాన కారణం.
మహారాష్ట్రలో ప్రముఖ పుణ్యక్షేత్రం, పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన షిర్టీలో బంద్ జరగనుంది. షిర్డీ సాయిబాబా ఆలయానికి భద్రత కల్పించే విషయంతో ట్రస్ట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. సాయిబాబా ఆలయానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ భద్రత కల్పించే ఆలయ ట్రస్ట్ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారి నిర్ణయంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలానే ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా మే 1 నుంచి షిర్డీలో నిరవధిక బంద్‌ను చేపడతామని గ్రామస్థులు హెచ్చరించారు.
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని షిర్డీ పట్టణంలోని సాయిబాబా ఆలయం అత్యంత ప్రముఖమైనది. ఈ చిన్న పట్టణం ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది. అలానే ఈ షిర్డీకి ప్రపంచవ్యాప్తంగా అన్నీ మతాల వారు ఏటా లక్షలాది మంది వస్తుంటారు. ఈ ఆలయాన్ని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నిర్వహిస్తుంది. 2018లో షిర్డీ విమానాశ్రయం భద్రతా వ్యవహారాలను సీఐఎస్ఎఫ్ కి అప్పగించారు. తాజాగా సాయిబాబా ఆలయాన్ని రక్షించడానికి ప్రభుత్వం కేంద్ర బలగాలను కేటాయించాలని సంస్థాన్ ట్రస్ట్ యోచిస్తోంది.
ఇందులో భాగంగా సీఐఎస్‌ఎఫ్ జవాన్లతో భద్రతను ఏర్పాటు చేయడంపై కసరత్తు చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర పోలీసులు, ఆలయాన్ని ఈ నిర్ణయాన్ని షిర్డీ గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అఖిలపక్ష నాయకులు, గ్రామస్థులు సమావేశమయ్యారు. మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన మే 1 నుంచి బంద్ పాటించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. సాయిబాబా ఆలయానికి సీఐఎస్‌ఎఫ్‌తో భద్రత వద్దని, సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టును రద్దు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ డిప్యూటీ కలెక్టరు, తహసీల్దార్, ప్రాంతీయ అధికారితో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు.
అలానే షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టీల బోర్డును వీలైనంత త్వరగా నియమించాలని కోరుతున్నారు. ఈ నియమాకంలో కూడా 50 శాతం ధర్మకర్తలు షిర్డీ గ్రామస్థులనే నియమించాలని కోరుతున్నారు. మరోవైపు, గ్రామస్థులు సమ్మెకు దిగినా.. భక్తుల కోసం సాయిబాబా మందిరాన్ని తెరిచే ఉంటుందని ట్రస్ట్ వెల్లడించింది. షిర్డీలో భక్తులు బస, సాయిబాబా ప్రసాదాలయం, క్యాంటీన్ కొనసాగుతాయి. భక్తుల కోసం సాయిబాబా సంస్థాన్‌లోని అన్ని సౌకర్యాలు యధావిధిగా ఉంటాయని ట్రస్ట్ వెల్లడించింది. మరి.. తాజాగా షిర్డీలో జరుగుతున్న వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.