కర్ణాటకలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఆత్మలతో మాట్లాడతనాంటూ అనుష్క అనే 17 ఏళ్ల బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇప్పటికి రెండు నెలలు గడుస్తున్నప్పటకి బాలిక ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షమానిజం (ఆత్మలతో మాట్లాడటం) కారణంగానే తమ కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. షమానిజం అనేది ఓ మతపరమైన ఆచారం. దీన్ని ప్రాక్టీస్ చేసే వారు.. ఆత్మలతో మాట్లాడుతున్నట్లు భావిస్తారు.
అనుష్క రెండు నెలల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయింది. 2021, అక్టోబర్ 31న ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. తనతో పాటు కేవలం రెండు జతల దుస్తులు, 2500 రూపాయల నగదు తీసుకుని వెళ్లిపోయింది. అనుష్క ఆన్ లైన్ లో షమానిజం గురించి చదువుతూ.. దాన్ని ప్రాక్టీస్ చేస్తూ.. వింతగా ప్రవర్తించేదని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ఈ విషయంలో కుమార్తెని పలు మార్లు హెచ్చరించినప్పటికి లాభం లేకపోయిందని అనుష్క తల్లిదండ్రులు తెలిపారు.
ఈ సందర్భంగా అనుష్క తండ్రి మాట్లాడుతూ.. ‘‘నా కుమార్తె మైనర్. తనకు తానుగా.. ఇది మంచి.. ఇది చెడు అనే నిర్ణయాలు తీసుకోలేదు. షమానిజం ఫాలో కావాలి అనుకుంటున్నట్లు నా కుమార్తె గతంలో నాకు తెలిపింది. ఆ తర్వాత తనలో చాలా మార్పులు వచ్చాయి. సెప్టెంబర్ నెలలో తన ప్రవర్తనలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. దాని గురించి తనను ప్రశ్నిస్తే.. మాతో మాట్లాడటం మానేసింది. చివరకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
⚠️ MISSING GIRL! ⚠️ Please share max! 17 year old Anushka has been missing from home, originally from Bangalore, and her loved ones are trying to locate her. Please RT and contact the number given if you have any information. Thank you for your help 🙏🏼 pic.twitter.com/iwYWByr7E7
— Kamya | Think For Yourself 🌻 (@iamkamyabuch) December 24, 2021
అనుష్క ఆచూకీ తెలపాల్సిందిగా సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చారు. ఇక అనుష్క తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు.. ఆమె ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమరాలను పరిశీలిస్తున్నారు. గత రెండు నెలలుగా అనుష్క ఎవరితో కాంటాక్ట్ లోకి రాలేదని పోలీసులు తెలిపారు. అనుష్క గురించి ఎవరికి సమాచారం తెలిసినా.. తమకు తెలపాల్సిందిగా కోరారు.