ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవడం అంత తేలికైన పని కాదని పర్వతారోహణ చేసేవారు అంటుంటారు. ఆక్సిజన్ అంతంత మాత్రంగానే అందే ఎవరెస్ట్ ప్రయాణం అంటే ప్రాణాలకు తెగించడమే అంటుంటారు. చాలా మందికి మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించాలని ఎంతో కోరిక ఉంటుంది.. కానీ అది అంద సాధ్యమయ్యే పని కాదు. ఎంతో కష్టపడితే కానీ లక్ష్యాన్ని చేరుకోలేము. అలాంటిది ఓ ఏడేళ్ల అమ్మాయి ఎవరెస్టు శిఖరం బేస్ క్యాంప్‌కు చేరుకుంది. అది కూడా అతి చిన్న వయసులో ఆ బాలిక రికార్డు సృష్టించింది. సాన్వీ సూద్ అనే ఏడేళ్ల అమ్మాయి ఈ అద్భుతమైన రికార్డు క్రియేట్ చేసింది. వివరాల్లోకి వెళ్లితే..
ఇది కూడా చదవండి: Dragon Blood Tree: ఇదెక్కడి వింత.. చెట్టు నుంచి రక్తం కారుతోంది.. ఎందుకిలా!
పంజాబ్ కి చెందిన సాన్వీ సూద్ అనే ఓ ఏడేళ్ల బాలిక మొహలీలోని యాదవీంద్ర స్కూల్‌లో రెండో తరగతి చదువుతోంది. ఎవరెస్టుపై 5,364 మీటర్ల ఎత్తులోని బేస్ క్యాంప్‌లో ఒక రోజు గడపాలని ఈ చిన్నారి బలంగా సంకల్పించింది. బాలిక కోరిక విన్న కుటుంబీకులు మొదట ఆశ్చర్యపోయారు. సాన్వీ సూద్ బలమైన కోరిక తీర్చేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఎవరెస్టు శిఖరం ఎలా అధిరోహించాలీ అన్న విషయాల గురించి ఆ చిన్నారి తెలుకుంది. అన్నింటికీ సన్నద్ధమైన తన ప్రయాణాన్ని సాగించింది.
సాన్వీ ఎవరెస్ట్ శిఖరం ఎక్కే సమయంలో చలితో పాటు విపరీతమైన గాలులు వచ్చినప్పటికీ తట్టుకొని తన ప్రయాణాన్ని ఎక్కడా ఆపకుండా ముందుకు సాగింది. ఇలా 65 కిలో మీటర్లు అన్ని అవాంతరాలు దాటుకుంటూ మొత్తానికి బేస్ క్యాంప్ కి చేరుకొని మన జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. 9 రోజుల్లోనే ఎంతో కష్టతరం అనిపించే ఎవరెస్టు శిఖరం చేరుకోవడం నిజంగా గొప్ప సాహసమే అంటున్నారు. సాన్వీ సూద్ చేసిన ధైర్య సాహసాలను నెటిజన్లు అభినందిస్తున్నారు. ఈ విషయం గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.