భారత్ లో బ్యాంకు రుణ ఎగవేతదారులు మొదటి పేరు వినిపించేది విజయ్ మాల్యా. కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులుగా తీసుకొని తన తిరిగి చెల్లించకుండా దాదాపు రూ.9 వేల కోట్ల మేర బ్యాంకు రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయారు. తాజాగా విజయ్ మాల్యాకు కోర్టు ధిక్కార కేసులో సుప్రీంకోర్టు శిక్ష ఖరారు చేసింది.
ఈ క్రమంలో విజయ్ మాల్యాకు 4 నెలల జైలు శిక్ష విధిస్తూ.. ధర్మాసనం తీర్పు వెలువరించింది. అంతేకాదు ఈ శిక్షతో పాటు రెండువేల జరిమానా కూడా విధించింది. ఇక ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ పి.ఎస్.నరసింహలు సభ్యులుగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. మాల్యా తరఫు న్యాయవాది వాదనలన్నీ విన్న ధర్మాసనం ఇంకా చెప్పాల్సినది ఏమైనా ఉంటే మార్చి 15లోపు రాతపూర్వకంగా సమర్పించాలని అప్పట్లో సూచించింది.