పొద్దున్నే లేవగానే మనం చేసే మొదటి పని.. చేతికి బ్రష్ తీసుకోవడం.. పేస్ట్ అంటివ్వడం.. చక చకా పళ్లు తోమడం. ఇది ఒక దిన చర్య. తప్పదు పళ్లు తెల్లగా మెరవాలన్నా , ముందు రోజు తిన్న స్మెల్ పోవాలన్నా. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అది తెలియాలంటే ఇది చదవాల్సిందే.
“ప్రపంచవ్యాప్తంగా డెంటిస్టులు సిఫారసు చేస్తున్న టూత్ పేస్ట్ సెన్సోడైన్.. ప్రపంచపు నెంబర్ వన్ సెన్సిటివిటీ టూత్ పేస్ట్” అనే యాడ్ మనం రోజూ టీవీలో చూస్తుంటాం. అయితే దీనిపై సీసీపీఏ (సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ) అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. నెంబర్ 1 టూత్ పేస్ట్.. అన్నట్లుగా వివరాలు మాకెందుకు సమర్పిచలేదు. ఈ ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని, వారం రోజుల్లో యాడ్ ను నిలిపివేయాలని సెన్సోడైన్ తయారీదారును ఆదేశించింది. అంతేకాదు, రూ.10 లక్షల జరిమానా కూడా వడ్డించింది.
ఇది కూడా చదవండి: ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయానికి ముస్లిం కుటుంబం భారీ విరాళం..!సెన్సోడైన్ టూత్‌పేస్ట్ యాడ్ కు సంబంధించి టీవీలోనూ, సోషల్ మీడియా మాధ్యమాల్లోనూ వస్తున్న వాణిజ్య ప్రకటనలను సీసీపీఏ సుమోటోగా స్వీకరించింది. ఏ ఆధారాలతో ప్రపంచవ్యాప్తంగా డెంటిస్టులు ఈ పేస్ట్ ను సిఫారసు చేస్తున్నారో సెన్సోడైన్ సంస్థ తమకు వివరాలు సమర్పించలేదని సీసీపీఏ తెలిపింది. మనదేశంలో దంతవైద్యుల నుంచి అభిప్రాయాలు తీసుకుని, ప్రపంచమంతా వైద్యులు సిఫారసు చేస్తున్నారంటూ ప్రచారం చేసుకోవడం సబబు కాదని, ఇది భారత నిబంధనలకు విరుద్ధమని చెప్పింది. మరోవైపు సెన్సోడైన్ బ్రాండ్ మాతృ సంస్థ జీఎస్‌కే కన్జ్యూమర్ హెల్త్‌కేర్ స్పందిస్తూ వినియోగదారుల సంక్షేమానికే తాము పెద్దపీట వేస్తామన్నది. ఉత్పత్తుల నాణ్యతలో రాజీపడబోమన్నది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.