విద్యార్ధుల్లోని ప్రతిభను బయటకు తీసుకురావటానికి ప్రతీ ఏటా సైన్స్ ఎగ్జిబిషన్‌లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎగ్జిబిషన్స్‌లో విద్యార్ధులు తాము తయారు చేసిన సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శిస్తూ ఉంటారు. గెలిచిన వాళ్లు బహుమతులు పొందుతూ ఉంటారు. తాజాగా, జార్ఖండ్‌లోనూ సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. ఈ ఎగ్జిబిషన్‌లో చోటుచేసుకున్న ప్రమాదం కారణంగా 11 మంది విద్యార్ధులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్, ఘట్‌శిలలోని ఘట్ శిల కాలేజ్‌లో తాజాగా పిల్లల సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది.
ఈ ఎగ్జిబిషన్‌కు రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. తాము తయారు చేసిన ప్రాజెక్టులను ప్రదర్శనకు ఉంచారు. ఇందులో ఓ రాకెట్ ప్రాజెక్టు కూడా ఉంది. ఇంటర్ స్టూడెంట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ విద్యార్థి దీన్ని తయారు చేశాడు. ఈ రాకెట్‌ను పరీక్షించిన ఎగ్జిబిషన్ నిర్వహకులు ప్రదర్శనకు ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అతడు ఎగ్జిబిషన్ చూడటానికి వచ్చిన వారికి రాకెట్ గురించి వివరించసాగాడు. కొద్దిసేపటి తర్వాత దాన్ని గాల్లోకి పంపించే ప్రయత్నం చేశాడు. కానీ, అది పైకి లేవలేదు.
దీంతో అది టెక్నికల్ సమస్యకు గురైందని అర్థం చేసుకున్నాడు. దాన్ని రిపేర్ చేయటం స్టార్ట్ చేశాడు. కొద్ది సేపటి తర్వాత అది పెద్ద శబ్ధంతో పేలింది. పేలుడు కారణంగా అక్కడ ఉన్న 11 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారందరినీ దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాకెట్ పేలిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Jharkhand | Students received injuries after their science project exploded during the model exhibition held at Ghatshila College earlier today. As per the college professor, around 11 students were injured, non of them critical. pic.twitter.com/5D1RUNRZJM
— ANI (@ANI) December 12, 2022