ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో విషయాలు ప్రజలకు తెలుస్తున్నాయి. ఈ మద్య కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు దాష్టికాలకు సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడు లో దారుణం జరిగింది. ఒక పాఠశాలలో విద్యార్థులు టాయిలెట్ కడుగుతున్న దృష్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఒకటి కాదు రెండు చోట్ల ఈ దారుణ సంఘటనలు జరిగాయి.
కాంచీపురం జిల్లాలోని అలపాక్కమ్ ప్రభుత్వ పాఠశాలలో కొంత మంది విద్యార్థినిలు టాయిలెట్ కడుగుతున్న దృశ్యాలను గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. మరోవైపు ఈరోడ్ జిల్లా పురుందురై గవర్నమెంటు పాఠశాలలో కొంతమంది విద్యార్థులు టాయిలెట్ కడుగుతున్న దృశ్యాలు సైతం సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈరోడ్ స్కూల్ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ రెండు ఘటనలకు బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లు డీఈవోలను ఆదేశించారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
பள்ளி மாணவி ஒருவர் பள்ளியின் கழிவறையை சுத்தம் செய்யும் வீடியோ சமூக வலைதளங்களில் வேகமாக பரவி வருகிறது. pic.twitter.com/pC9VDTJWZA
— Kishore Ravi (@Kishoreamutha) March 29, 2022