భర్త సంపాదనపై అతడి భార్య, పిల్లలకు పూర్తి హక్కు ఉంటుంది. వీలునామా రాస్తే.. దాని ప్రకారం ఆస్తుల పంపకం ఉంటుంది. అలా చేయకపోతే.. ఆయన వారసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇక ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. తాజాగా ఇలాంటి ఓ కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. హిందూ వ్యక్తి తన భార్య పోషణ, బాగోగుల నిమిత్తం ఏర్పాట్లు చేసి.. తాను సంపాదించిన ఆస్తిని భార్య జీవితాంతం అనుభవించేలా పరిమితులతో కూడిన వీలునామా రాసిన పక్షంలో.. సదరు ఆస్తిపై ఆమెకు పూర్తి హక్కులు ఉండవని.. సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హరియాణాకు చెందిన ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎం.ఎం సుందరేశ్ ల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు వివరాలు..
హరియాణాకు చెందిన తులసీ రామ్ మొదటి భార్య చనిపోవడంతో.. రామ్ దేవిని రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో తన ఆస్తిని.. రెండో భార్య రామ్ దేవి, కుమారుడికి చెందేలా 1968లో వీలునామా రాశారు. తన ఆస్తిని భార్య జీవితకాలమంతా అనుభవిస్తూ.. దాని మీద వచ్చే ఆదాయంతో జీవించవచ్చని పేర్కొన్నాడు. ఆమె మరణించిన తర్వాత యావత్ ఆస్తి సంపూర్ణంగా కుమారుడికే చెందాలని తులసీరామ్ వీలునామాలో స్పష్టం చేశారు. 1969లో అతడు మృతి చెందాడు.
ఈ క్రమంలో కొందరు వ్యక్తులు తులసీరామ్ భార్య రామ్ దేవి నుంచి ఆస్తిని కొనుగోలు చేయడం వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో రామ్ దేవి కుమారుడు కోర్టును ఆశ్రయించాడు. చివరకు ఈ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. ఈ క్రమంలో కోర్టు రామ్ దేవి నుంచి ఆస్తులను కొనుగోలు చేసిన వ్యక్తులకు అనుకూలంగా సేల్ డీడ్ లను కొనసాగింలేం అని స్పంష్టం చేసింది. అంతేకాక.. భార్త ఆస్తిపై భార్యకు సంపూర్ణ హక్కు లేదని స్పష్టం చేసింది.