గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దైవ దర్శనానికి వెళ్తున్న భక్తుల వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా.. 16 మంది భక్తులు గాయాలపాలయ్యారు. గాయాలైన భక్తుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దైవ దర్శనానికి వెళ్తుండగా ఇలాంటి ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటక రాష్ట్రంలో ఈ ప్రమాదం సంభవించింది. బెళగావి జిల్లా హులుకుంట గ్రామానికి చెందిన భక్తులు సవదత్త యల్లమ్మ దర్శనార్థం వెళ్తున్నారు. ఓ గూడ్స్ కారియర్ వాహనంలో బయల్దేరారు. చుంచునూరు గ్రామం సమీపంలో విఠలప్ప ఆలయం ఉంది. ఆ దేవాలయానికి ఎదురుగా ఓ పెద్ద మర్రిచెట్టు ఉంది. భక్తుల ప్రయాణిస్తున్న వాహనం ఆ మర్రిచెట్టును బలంగా ఢీకొట్టింది. మర్రిచెట్టుని ఢీకొట్టి గూడ్స్ కారియర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయాలపాలైన వారిని స్థానికులు ఆస్పత్రకి తరలించారు.
ఆస్పత్రికి తరలిస్తుండగా మరో భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులు కనమవ్వ(24), దివ్యా(31), సవితా(12), సుప్రితా(11), మారుతి(42), ఇంద్రవ్వ(24)గా గుర్తించారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. అతివేగమా? రాత్రి ప్రయాణం కావడంతో డ్రైవర్ నిద్రపోవడం వల్ల ప్రమాదం జరిగిందా? వాహనంలో ఎక్కువ మంది ఉండటం వల్ల అదుపుతప్పి ప్రమాదం జరిగిందా? అనే వాటిపై స్పష్టత రావాల్సి ఉంది.
6 killed & 16 injured in car #accident @Belagavi dist, #Karnataka. Victims belongs to hulakunda village and all are traveling towards soudatti yellamma #temple. #Traffic #RoadAccident pic.twitter.com/Q0BKaGKBaq
— Bharathirajan (@bharathircc) January 5, 2023