ప్రపంచ దేశాల్లో పలు చోట్ల తరుచూ విమాన, హెలికాప్టర్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొంత సమయం తర్వాత విమానంలో టెక్నికల్ ఇబ్బందులు తలెత్తడం, వాతావరణంలో అనుకోని మార్పులు వచ్చి ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
గత కొంత కాలంగా పలు దేశాల్లో వరుస విమాన, హెలికాప్టర్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది సమయానికే సాంకేతిక లోపాలు తలెత్తడం.. ఒక్కసారిగా ఆకాశంలో మార్పులు సంభవించి ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే కొన్నిసార్లు ప్రమాదాన్ని ముందుగానే పైలెట్లు గమనించి సురక్షితమైన ప్రదేశాల్లో ల్యాండింగ్ చేస్తూ ప్రయాణికుల ప్రాణాలు రక్షిస్తున్నారు. ఇటీవల నేపాల్ లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో 72 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. సౌదీ అరేబియాకు చెందిన కార్గో విమానానికి ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే పలు విమానాలు ప్రమాదాలకు గురైతున్నాయి. గాల్లో ప్రయాణిస్తూ గాల్లో ప్రాణాలు కలిసిపోతున్న ఘనటనలు చూసి విమాన ప్రయాణం చేయాలంటేనే కొంతమంది భయంతో వణికిపోతున్నారు. తాజాగా సౌదీ అరేబియాకు చెందిన కార్గో విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటి తర్వాత విండ్ షీల్డ్ కు పగుళ్లు రావడం గమనించిన పైలెట్ వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన అధికారులు.. విమానాశ్రయంలో అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అనంతరం విమానం సెఫ్ గా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆ మద్య బెంగుళూరు నుంచి అబుదాబీ వెళ్తున్న ఎటిహాద్ విమానంలో టెక్నికల్ ఇబ్బంది తలెత్తడంతో వెంటనే ఆ విమానాన్ని తిరిగి బెంగుళూరు విమానాశ్రయంలో తిరిగి ల్యాండ్ చేశారు. ఇటీవల అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ కి వస్తున్న ఇండిగో విమానం టేకాఫ్ అయిన కొద్ది సమయానికే వడగళ్ల వాన కురవడంతో విమానం ముందుభాగం దెద్బతింది. ఈ ఘటన గాల్లో ఉండగానే జరగడంతో పైలెట్ ప్రమాదాన్ని గమనించి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
An emergency landing was made by a Saudia Airlines cargo flight after the windshield cracked mid-air #SaudiaAirlines #Kolkata https://t.co/Us7sQd9OeF
— Republic (@republic) April 15, 2023