రాత్రిపూట ఫుల్లుగా తిని.. చల్లగా నిద్రలోకి జారుకుంటే.. బోలెడు కలలు మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి. అందులో మనం చేయలేని పనంటూ ఏదీ ఉండదు. సీఎం, పీఎం పాత్రదారుల నుంచి మొదలుపెడితే.. ఆస్ట్రోనాట్ గా ఎదిగి అంతరిక్షంలోకి కూడా పయనిస్తుంటాం. కాకుంటే.. పొద్దున్నే లేవగానే.. అయ్యో ఇదంతా కలనా! అనుకుంటుంటాం. కానీ, మన కథలో ఓ వనిత ఇలానే కలలు కన్నది.. ఆ కలలను సాకారం కూడా చేసుకుంది. నేడు దేశంలోనే తొలి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్‌గా చరిత్ర సృష్టించనుంది. ఆ వివరాలు..
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని జసోవర్ గ్రామానికి చెందిన ఒక టీవీ మెకానిక్ కూతురే.. సానియా మీర్జా. తండ్రి సాధారణ టీవీ మెకానిక్, తల్లి గృహిణి. వీరి సంపాదన తాను అనుకున్న లక్ష్యాన్ని చేర్చలేదని ఆమెకు తెలుసు. కానీ, ఆ లక్ష్యాన్ని ఎన్నడూ మరువలేదు. 10వ తరగతి వరకు జసోవర్ గ్రామంలోనే చదివిన సానియా, అనంతరం పండిట్ చింతామణి దూబే కాలేజీలో ఇంటర్మీడియట్ చదివింది. ఆ పరీక్షా ఫలితాల్లో జిల్లా టాపర్‌గా నిలిచింది. ఈ విజయంపై ప్రసంగించిన ఆమె.. కష్టపడితే హిందీ మీడియం విద్యార్థులు కూడా విజయం సాధిస్తామనే నమ్మకానికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ అని అందరిలో ధైర్యం నూరిపోసింది. ఈ విజయం ఆమెకు మరింత ఉత్తేజాన్ని ఇచ్చింది. తాను చిన్నప్పుడు కన్న కలలు గుర్తొచ్చాయి. ఎలాగైనా ఫైటర్ పైలట్ అవ్వాలనుకుంది.
Uttar Pradesh’s Sania Mirza to become India’s 1st Muslim woman fighter pilot
Sania has been selected to become a fighter pilot in the Indian Air Force & among women, her rank is 10th. pic.twitter.com/rpoViDrSb2
— Indian American Muslim Council (@IAMCouncil) December 23, 2022
దేశంలోనే మొట్టమొదటి మహిళా ఫైటర్ పైలట్‌గా గుర్తింపు పొందిన అవని చతుర్వేది అడుగుజాడల్లో నడవాలనుకుంది.. నిరంతరం తన లక్ష్యాన్ని గుర్తుచేసుకుంటూ కష్టపడింది. గగన విహారమే కాక యుద్ధాలు కూడా చేయగలమని చూపించేందుకు ముందుకు వచ్చింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షలో పాస్ అయ్యింది. భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా సెలెక్ట్ అయ్యింది. దేశంలోనే మొదటి ముస్లిం యువతిగా రికార్డు బద్దలు కొట్టింది. అంతేకాదు ఉత్తర్ ప్రదేశ్ నుంచి తొలి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ కావడం విశేషం. ఈ నెల 27న సానియా పుణెలోని ఖడక్ వాస్లా నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరనున్నారు.
నేషనల్ డిఫెన్స్ అకాడమీ 2022 పరీక్షలో పురుషులు, మహిళలకు కలిపి మొత్తం 400 సీట్లు కేటాయించారు. ఇందులో మహిళలకు 19 సీట్లు. ఫైటర్ పైలట్‌లకు రెండు సీట్లు మాత్రమే రిజర్వ్ అయ్యాయి. తొలి ప్రయత్నంలో సీటు సాధించలేకపోయానని సానియా, రెండో ప్రయత్నంలో ఆ లక్ష్యాన్ని చేధించారు. ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ.. “భారత వాయుసేనలో చేరి యుద్ధ విమానం నడపాలన్నదే నా కల. అందుకు దేశంలోనే మొట్టమొదటి మహిళా ఫైటర్ పైలట్‌గా గుర్తింపు పొందిన అవని చతుర్వేదిని రోల్ మోడల్ గా ఎంచుకున్నా. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రవేశం పొందా..” అని చెప్పుకొచ్చింది. ఈ వనిత సాధించిన విజయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mirzapur’s Sania Mirza will became first Muslim woman fighter pilot after securing 149th rank in NDA exam
“I was very much inspired by Flight Lieutenant Avani Chaturvedi & seeing her I decided to join NDA. I hope younger generation will someday get inspired by me: Sania Mirza pic.twitter.com/6SMKIi2g5m
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 22, 2022