ప్లాస్టిక్ అనేది భూమికి ఎంతో చేటు చేస్తోంది. దీనివల్ల ఇప్పటికే చాలా పర్యావరణం దెబ్బతింది. కానీ, ప్రజలు మాత్రం ఈ ప్లాస్టిక్ ని అరికట్టేందుకు ముందుకు రావడం లేదు. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రమాదకారిగా మారుతున్నాయి. అందుకే ఒక గ్రామ సర్పంచ్ ఈ ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో ఒక వినూత్న ఆలోచన చేశారు.
ప్లాస్టిక్ అనేది క్యాన్సర్ లాగా పర్యావరణాన్ని పట్టి పీడిస్తోంది. ఇప్పటికే భారత్ సహా ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలు ప్లాస్టిక్ మీద పోరాటం చేస్తున్నాయి. ప్లాస్టిక్ భూతాన్ని రూపుమాపి పర్యావరణాన్ని రక్షించాలని తాపత్రయపడుతున్నారు. అయితే ఇది ఒక ప్రభుత్వం వల్లో, ఒక సంవత్సరంలోనో జరిగే పని కాదు. ముఖ్యంగా పౌరులు ఇందుకు నడుం బిగించాలి. ఒకవేళ ప్రజలు అందుకు ఆసక్తిగా లేకపోతే ఆ ఇంట్రస్ట్ ని తీసుకురావాల్సిన భాద్యత ప్రజా ప్రతినిధులపై ఉంది. అలాంటి ఒక వినూత్న ఆలోచనతో ఈ సర్పంచ్ మొత్తం గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చేశారు.
ప్లాస్టిక్ ని అరికట్టాలంటే ముందు ప్రజల్లో మార్పు రావాలి. వాళ్లే స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించాలి. చాలామందిలో ఆ మార్పు వచ్చింది. ఇలాంటి సర్పంచులు ఉంటే ఇంకా త్వరగా ఆ మార్పు రావచ్చు. ఇప్పుడు చెప్పుకోబోయేది.. సౌత్ కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని షహబాద్ బ్లాక్ సాదీవర పంచాయతీ సర్పంచ్ గురించి. సర్పంచ్ ఫరూక్ అహ్మద్ వృత్తి పరంగా న్యాయవాది. గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చేయాలని ఒక వినూత్న ఆలోచన చేశారు. ‘ప్లాస్టిక్ తీసుకురండి- బంగారం పొందండి’ అంటూ ప్రచారం చేశారు. ఈ క్యాంపైన్ ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.
The village Panchayat has started a unique mission for saving the environment. The village head has started a campaign called ‘Give Plastic and Take Gold’. Under the scheme, if someone gives plastic waste of 20 quintals, then the Panchayat will give him a Gold coin. pic.twitter.com/ckzCegJrdu
— Aneesa Tareen (@TareenAneesa) April 4, 2023
ఫరూక్ అహ్మద్ చేసిన ఆలోచన ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఈ కార్యక్రమం ప్రకారం ఎవరైతే 20 క్విటాళ్ల ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొస్తారో.. వారికి బంగారు నాణెం ఇస్తామని ప్రకటించారు. వింత ఏంటంటే.. ఆ ప్రకటన చేసిన చాలా కొద్ది రోజుల్లోనే ఆ గ్రామం మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాల రహిత గ్రామంగా మారింది. అధికారులు సైతం సాదీవర గ్రామాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల రహిత గ్రామంగా కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఆ గ్రామం, సర్పంచ్ ఫరూక్ అహ్మద్ నెట్టింట వైరల్ అవుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు ఇలాంటి వినూత్న ఆలోచనలు చేస్తే పర్యావరణం కచ్చితంగా బాగుపడుతుందంటూ కామెంట్ చేస్తున్నారు. ఫరూక్ అహ్మద్ ఆలోచనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
He started a campaign by the name ‘Give Plastic and Take Gold’ where people of the village are asked to collect plastic waste and get a gold coin from the panchayat head.#JammuAndKashmir pic.twitter.com/uFw5UppDcH
— Seher Mirza (@SeherMirzaK) March 7, 2023