ప్రస్తుతం ఉన్న ఎంఎన్‌సీ(MNC) కంపెనీల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు చాలా మంచి పేరు ఉంది. ప్రపంచవ్యాప్తంగా టీసీఎస్ బ్రాంచ్‌లు ఉన్నాయి.. వేలాది మంది ఉద్యోగులు సంస్థలో పని చేస్తున్నారు. ఇక టాటాల కంపెనీ కావడంతో ప్రజల్లో టీసీఎస్ పట్ల విశ్వసనీయత ఎక్కువ. ఇక ఈ కంపెనీలో ఉద్యోగం రావాడం చాలా గ్రేట్‌గా భావిస్తారు. ఇక టీసీఎస్ యాజమాన్యం కూడా తన ఉద్యోగుల పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తుందనే పేరుంది. మరి ఇంత మంచి పేరు కలిగిన టీసీఎస్ కంపెనీకి చెన్నైలోని లేబర్ కోర్టు షాకిచ్చింది. సరైన కారణాలు లేకుండా ఉద్యోగిని జాబ్‌లోంచి తీసేసిందని కోర్టు తెలిపింది. ఇందుకు గాను సదరు ఉద్యోగిని కంపెనీలో తిరిగి చేర్చుకోవడమే కాక.. నష్టపోయిన కాలానికి సంబంధించి అతడికి పూర్తి అలవెన్స్‌లు, బెనిఫిట్స్ కల్పించాలని ఆదేశించింది. ఆ వివరాలు..
తిరుమలై సెల్వన్ (48) టీసీఎస్ లో మేనేజర్ హోదాలో పని చేస్తున్న సమయంలో ఊహించిన విధంగా యాజమాన్యం ప్రవర్తించింది. సరైన కారణాలు పేర్కొనకుండా అతన్ని ఫ్రీలాన్సర్‌గా మారమంటూ ఒత్తిడి తెచ్చింది. దీంతో గడిచిన ఏడేళ్లుగా అతను ఫ్రీలాన్సర్‌గా పని చేస్తూ నెలకు కేవలం రూ. 10,000 జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. కుటంబం గడిచేందుకు అతని భార్య కూడా పని చేస్తోంది
ఇది కూడా చదవండి: Woman: 23 ఏళ్లకే 23 ఉద్యోగాలు చేసిన యువతి! చివరికి ఏ స్థాయికి చేరిందంటే..
సరైన కారణాలు పేర్కొనకుండా తనను ఉద్యోగంలోంచి తొలగించారంటూ తిరుమలై సెల్వన్ చెన్నైలోని లేబర్‌కోర్టును ఆశ్రయించాడు. అతనికి మద్దతుగా ది ఫోరమ్ ఫర్ ఐటీ ఎంప్లాయిస్ కూడా నిలబడింది. ఇలా ఏడేళ్లలో 150 సార్లు కోర్టులో వాదప్రతివాదనలు జరిగాయి. మొత్తంగా ఉద్యోగంలోకి తీసుకున్న వ్యక్తిని సరైన కారణాలు చూపకుండా తొలగించడం తప్పని చెబుతూ న్యాయస్థానం తాజాగా తీర్పు ఇచ్చింది.
ఇది కూడా చదవండి: No Daily Usage Limit: సూపర్ ప్రీపెయిడ్ ప్లాన్.. రూ.398కే అన్ లిమిటెడ్ డేటా!
సెల్వన్‌కు వ్యతిరేకంగా టీసీఎస్ తరఫున వినిపించిన వాదనలు అర్థరహితమంటూ వ్యాఖ్యానించింది. ఒక ఉద్యోగిగా సెల్వన్ నష్టపోయిన కాలానికి సంబంధించి పూర్తి పరిహారాన్ని జీతం, ఇతర బెనిఫిట్స్‌తో సహా చెల్లించాలని టీసీఎస్‌ను న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాదు అతన్ని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని చెప్పింది. కోర్టు తీప్పు పట్ల ఐటీ ఎంప్లాయిస్ ఫోరం హర్షం వ్యక్తం చేసింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Whatsappలో ఫాదర్స్ డే మెసేజెస్ క్లిక్ చేస్తున్నారా? బుక్కైపోతారు జాగ్రత్త!