సాధారణంగా ఎవరైనా డబ్బులు ఉదారంగా ఖర్చు పెట్టినా.. డబ్బులు కావాలన్నా.. అదేంటీ డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా అని అంటారు. నిజంగా డబ్బులు కాసే చెట్టు ఉంటే ఇక జీవితం ధన్యమైనట్లే. కాకపోతు కొన్ని సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు అప్పుడప్పుడూ చూస్తుంటాం. అదే సీన్ రియల్ లైఫ్ లో చూస్తే.. నిజంగా మతి పోతుంది. తాజాగా ఓ చెట్టుకు కాసిన కాయల్లో రూపాయి నాణేలు నిండుగా కనిపిస్తున్నాయి. చెట్లకు కాసులు కాయడం ఏంటి మరీ విడ్డూరం కాకపోతేను అని తిట్టిపోస్తాస్తే.. పప్పులో కాలు వేసినట్టే. నిజంగా చెట్లకు కాసులు కాస్తున్నాయి అని చెప్పి ఓ ఇస్టాగ్రామ్ యూజర్ వీడియో తీసి చూపించాడు. ఆ వీడియోలో క్యాప్సికమ్ కాయను కట్ చేయగా అందులో నుంచి రూపాయి నాణేలు కింద పడ్డాయి. రెండో కాయను కట్ చేయగా అందులో నుంచి నాణేలు కిందపడ్డాయి.
ఇక క్యాప్సికమ్ కాయ నుంచి డబ్బులు రాలడం చూస్తేంటే నెటిజన్లు షాక్ తింటున్నారు. ఓ వ్యక్తి తన పెరట్లో భారీగా క్యాప్సీకం చెట్లను పెంచాడు.. అవి కోతకు వచ్చే సమయం వచ్చింది. ఇక క్యాప్సీకం కాయను కోయడానికి వెళ్లాడు.. మొదటి కాయ కోయగా అందులో పదుల కొద్ది నాణేలు బయట పడ్డాయి.. దాంతో షాక్ తిని మరో కాయను కోశాడు. అందులో కూడా పదుల కొద్ది నాణేలు బయట పడ్డాయి. ఇది చూసి ఆ వ్యక్తి ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడు.. అబ్బే అలా నటించాడు అంతే.
అసలు విషయానికి వస్తే.. ఇది కేవలం యూజర్లను ఆకట్టుకోవడం కోసం చేసిన వీడియో మాత్రమే అని, ముందుగా కాయను మధ్యకు కోసి అందులో డబ్బులు ఉంచి దాన్ని తెల్లడి జెల్లి లాంటి జిగురుతో అంటించాడట. దాంతో అసలు అతికించినట్లుగా కనిపించడం లేదు. అలా చేసి కాయను కోస్తూ డబ్బులు రావడం చూపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దాన్ని కాస్త తన ఇన్ స్ట్రాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. వీడియో పాపులర్ కావడం కోసం ఏదైనా చేయవచ్చిన అంటున్నాడు విడీయో రూపకర్త. జనాలు మరీ అంత పిచ్చోల్లు కాదు బ్రదర్ అంటూ.. ఆ వ్యక్తిని తిట్టిపోస్తున్నారు.