పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 ముగ్గురు టీచర్లతో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక గాయపడిని వారిని పోలీసులు, స్థానికులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.
పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు టీచర్లతో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసలేం జరిగిందంటే? పంజాబ్ లోని తరణ్ జిల్లాలోని ఫిరోజ్ పూర్ ప్రాంతం. శుక్రవారం ఉదయం స్కూల్ కు వెళ్లేందుకు ఏకంగా 13 మంది టీచర్లు క్రూయిజర్ కారులో బయలేదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఖాయ్ ఫేమ్ గ్రామ సమీపంలోకి రాగానే వీరి కారును ఓ బస్సు ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఆ కారు ఎగిరి కింద పడింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు టీచర్లతో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అంతేకాకుండా ఆ కారులో ప్రయాణిస్తున్న 10 మంది టీచర్లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించగా, గాయపడినవారిని వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై స్పందించిన డిప్యూటీ కమిషనర్ రాజేష్ ధీమన్ ఘటనా స్థలానికి చేరుకుని పరీశీలించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.