పెళ్లికి వెళుతూ, ఇష్ట దైవాన్ని దర్శించుకుని వస్తుండగా, ఎన్నో ఏళ్ల తరబడి ఇంటికి దూరంగా ఉన్న కుమారుడు తిరిగి వస్తున్న సమయంలో ఈ రోడ్డు ప్రమాదాలు పొట్టనబెట్టుకుంటున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా కుటుంబాలకు కుటుంబాలు ప్రాణాలు కోల్పోతున్నారు.
రహదారులు రక్తమోడుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది మరణిస్తున్నారు. వేడుకలు, పండుగలు, సంతోష సమయాల్లో ఊహించని విధంగా రోడ్డు ప్రమాదాలు జరిగి.. ఆ ఇంట్లో విషాదాలు నింపుతున్నాయి. పెళ్లికి వెళుతూ, ఇష్ట దైవాన్ని దర్శించుకుని వస్తుండగా, ఎన్నో ఏళ్ల తరబడి ఇంటికి దూరంగా ఉన్న కుమారుడు తిరిగి వస్తున్న సమయంలో వారిని ఈ రోడ్డు ప్రమాదాలు పొట్టనబెట్టుకుంటున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా కుటుంబాలకు కుటుంబాలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక మంది చనిపోతున్నారని నివేదికలు చెబుతున్నాయి. తాజాగా మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్గోనే జిల్లాలో బస్సు లోయలో పడిన ఘటనలో 15 మంది మృతి చెందారు. శ్రీఖండి నుండి 70 మంది ప్రయాణీకులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి బోరాడ్ నది వంతెన రెయిలింగ్‌ను ఢీకొని లోయలో పడిపోయింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదస్థలానికి జిల్లా కలెక్టర్ శివరాజ్ సింగ్ వర్మ చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బోరాడ్ నదిపై 50 అడుగుల ఎత్తులో వంతెన నిర్మించారు. ఈ వంతెనపై వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. వేసవి కాలం కావడంతో బోరాడ్ నది ఎండిపోయింది. బస్సు నదిలో పడిపోవడంతో బస్సులోని ప్రయాణీకులు గాయపడ్డారు. ఈ ఘటనలో 15 మంది చనిపోగా.. 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.