తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు తన విలనీజంతో ఆకట్టుకున్న రామిరెడ్డి లివర్ సంబధిత వ్యాధితో 2011, ఏప్రిల్ 14న మరణించిన విషయం తెలిసిందే. అంకుశం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు.. అదే పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో ఆయన పేరు మరోసారి తెరపైకి వచ్చింది.. కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో కాదు.. బీహార్ రాష్ట్రంలో రామిరెడ్డి పేరు పేరు హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు నటుడు, అందులోనూ మరణించిన ఇన్నేళ్ల తర్వాత ఎందుకు ఆయన పేరు తెర మీదికి వచ్చిందనేగా మీ సందేహం. అసలు విషయానికి వస్తే.. హోంమంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు అమిత్ షా 57 వ పుట్టినరోజు సందర్భంగా పలు రాష్ట్రాల బిజెపి సభ్యులు ఆయన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ గవర్నర్ తమిళిసై సెలందర రాజన్, తమిళనాడు, బీజేపీ నేత అన్నామలై, అన్నాడీఎంకే సమన్వయకర్త ఓ.పన్నీర్‌సెల్వం, కో-ఆర్డినేటర్ ఎడప్పాడి పళనిసామి కూడా అమిత్ షాకి అభినందనలు తెలిపారు.
ఈ నేపథ్యంలో బిహార్ రాష్ట్రీయ జనతా దల్ పార్టీ ఎమ్మెల్యే సురేంద్ర ప్రసాద్ యాదవ్ ట్విట్టర్‌లో నటుడు రామిరెడ్డి ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘మన హోం మంత్రి అమిత్‌షాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. అందులో కొందరు రామి రెడ్డిని గుర్తించి ఇతను తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడు అంటూ కామెంట్ చేస్తున్నారు.
Happy Birthday to our Home Minister @AmitShah Ji. 🙏🏻😌 pic.twitter.com/fPDoBo62x7
— Surendra Prasad Yadav (@iSurendraYadav) October 22, 2021