అడవిలో అనేక జంతువులు ఉంటాయి. మనుషులకంటే నగరాల్లో, గ్రామాల్లో ఇళ్ళు ఉన్నాయి. అడవి జంతువులకి ఉన్నది ఒకటే జిందగీ.. వాటి ఇల్లు అడవే కదా. మరి ఆ అడవిలో అవి చక్కగా కాపురం చేసుకుంటుంటే మనుషులు వెళ్లి డిస్టర్బ్ చేయవచ్చా? అవి మంచి కార్యంలో ఉన్నప్పుడో, మేస్తున్నప్పుడో వెళ్లి డిస్టర్బ్ చేస్తే కుక్కని తరిమినట్టు తరుముతాయి. ఒక్కోసారి తిక్క లేస్తే తరుముతాయి. కానీ వాటి జోలికి వెళ్తున్నట్లు వాటికి అనిపిస్తే ఖచ్చితంగా తరుముతాయి. గతంలో ఇలాంటి ఘటనలు అనేకం చూసాం. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చూసుకుంది. వైల్డ్ లైఫ్ పేరుతో కొంతమంది పర్యాటకులు అడవుల్లో జంతువులను చూసేందుకు సఫారీల మీద వెళ్తుంటారు.
అందమైన అడవుల మధ్య ఉన్న ఆ జంతువుల కదలికలను కెమెరాల్లో బంధిస్తుంటారు. ఈ క్రమంలో కూర జంతువులతో పెద్ద సమస్య లేదు గానీ.. క్రూర జంతువులతోనే అసలు సమస్య మొదలవుతుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇక అంతే సంగతి. తాజాగా ఓ గ్యాంగ్ జంతువులను వీక్షించేందుకు ఓ పార్క్ కి వెళ్ళింది. అయితే ఆ పార్క్ లో ఉన్న ఖడ్గమృగం సడన్ గా వచ్చి.. టూరిస్టుల వాహనాలను వెంబడించడం మొదలు పెట్టింది. దాదాపు 3 కి.మీ.ల మేర ఆ ఖడ్గమృగం వారిని వెంబడించింది. ఓ డ్రైవరు త్వరగా పోనియ్.. రైనోసర్ వచ్చేస్తుంది’ అంటూ అరవడం మొదలుపెట్టారు. డ్రైవర్ వెహికల్ స్పీడ్ ని పెంచి చివరికి తప్పించుకున్నారు. ఈ ఘటన అస్సాంలోని కజిరంగా జాతీయ పార్కులో చోటు చేసుకుంది.
సఫారీ జీపులు కజిరంగా జాతీయ పార్క్ లోని ఇరుకు రోడ్డు మీదుగా వెళ్తుండగా.. ఖడ్గమృగం తరుముతుంది. జీప్ లో ఉన్న మహిళ.. ‘వేగం పెంచు’ అంటూ భయంతో అరుస్తుంది. 3 కిలోమీటర్ల వరకూ తరిమికొట్టిన ఖడ్గమృగం.. పొదలు రాగానే అదృశ్యమైంది. సఫారీ జీపులు అడవి ప్రాంతం మీదుగా వెళ్తుండగా.. పొదల్లోంచి ఒక్కసారిగా ఖడ్గమృగం బయటకు వచ్చి పర్యాటకులను వెంబడించింది. ఖడ్గమృగం తరుముతుందని తెలుసుకున్న డ్రైవర్లు.. వెంటనే వాహనాల వేగాన్ని పెంచారు. అచ్చం సినిమాలో సీన్ ని తలపించేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
…जब काजीरंगा में 3 किलोमीटर तक गैंडा करता रहा पर्यटकों की कारों का पीछा, डर से चिल्लाते रहे टूरिस्ट pic.twitter.com/Aiqc9U18Zg
— NDTV India (@ndtvindia) December 31, 2022
కజిరంగా జాతీయ పార్కు అనేది 2,613 ఖడ్గమృగాలకు ఇల్లు లాంటిది. అలాంటి తమ ఇంటికి చెప్పాపెట్టకుండా వస్తే ఇదిగో ఇలానే ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నేషనల్ పార్క్ అథారిటీ వాళ్ళు చెప్తున్న డేటా ప్రకారం.. ఖడ్గమృగాల జనాభా పెరుగుతుందట. అది మేటర్.. అవి జనాభా పెంచుకునే పనిలో బిజీగా ఉంటే వాహనాల శబ్దాలు, సొల్లు మాటలతో వాటికీ డిస్టర్బెన్స్ అనిపించి వెంబడించాయి. ఇంకో పాలి మా ఇలాకాలోకి వచ్చి ఫోటోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ అన్నారంటే కోసి కారం పెడతా నీ తల్లి అని అర్థం వచ్చేలా టూరిస్ట్ లను తరిమికొట్టింది.