సాధారణంగా శివుడు ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అని చాలామంది నమ్ముతుంటారు. అందుకేనేమో ఓ భూ ఆక్రమణ అభియోగంపై ఏకంగా శివుడికే అధికారులు నోటిసులు జారీ చేశారు.ఈ నెల 25లోగా విచారణకు హాజరుకావాలని, లేదంటే ఆ భూమిని బలవంతంగా ఖాళీ చేయించడమే కాకుండా, రూ.10 వేల జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. గోపాల గోపాల సినిమాలో హీరో దేవుడిపై కేసు వేసినట్లు ఈ అధికారులు శివుడికే నోటీసులు ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అధికారులకు మతిపోయినట్లు ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని రాయ్ గఢ్ లోని 25వ వార్డుకు చెందిన రజ్వాడే అనే వ్యక్తి ఇటీవల ప్రభుత్వ భూమి ఆక్రమణపై బిలాస్‌పూర్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశాడు. ఆ ప్రభుత్వ భూమిలో శివాలయంతో సహా 16 మంది కక్షిదారులుగా పేర్కొన్నారు. ఈ పిటీషన్ ను విచారించిన హైకోర్టు పూర్తి స్తాయి దర్యాప్తు జరిపి వివరాలు తెలియజేయాలని రాష్ట్ర్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో వెంటనే స్పందించిన ప్రభుత్వం అధికారులను విచారణకు పంపింది.విచారణ జరిపి అక్కడ తెలిసిన వివరాల ఆధారంగా చర్యలకు ఉపక్రమించారు. తహశీల్దార్ అధికారులు పది మందికి నోటీసులు జారీ చేశారు. ఇక్కడో విశేషం ఏమిటంటే ఆరో నిందితుడిగా శివుడి సమాన్లు పంపండం గమన్హారం. అయితే ఆ ఆక్రమణలో ఉన్న శివాలయాన్ని పిటిషనర్ నిందితుడిగా పేర్కొనడంతో అధికారులు ఈ పనిచేసినట్లు తెలుస్తోంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.