గోవాలో మద్యం చాలా చీప్‌గా దొరుకుతుంది. ముఖ్యంగా బీర్లు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా చీప్‌గా దొరుకుతాయి. అందుకే పర్యాటకులు ఎక్కువ మంది బీర్ల కోసం అక్కడికి ఎగబడుతూ ఉంటారు.
మనదేశంలో పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రముఖ కట్టడాలు, దేవాలయాలు, వంతెనలు,నదీ పరివాహక ప్రాంతాలు, ఇతర ప్రసిద్ధి చెందిన వారసత్వ నిర్మాణాలు మొదలైనవి ఉన్నాయి. కొన్ని అద్భుతమైన ప్రకృతి ప్రసాదించిన సహజ ప్రాంతాలు కూడా మన దేశంలో అనేకం ఉన్నాయి. అంతేకాదు! సంవత్సరం పొడవునా సందర్శించగల ప్రాంతాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో గోవా కూడా ఒక అద్భుత పర్యాటక ప్రదేశం. ఇక్కడ అందమైన బీచ్‌లు చాలా ఉన్నాయి. సందర్శకులకు గోవా చాలా ఫేవరేట్ ప్లేస్. పోర్చుగీసు కాలంనాటి నిర్మాణాలు, అడవులు, జలపాతాలు సందర్శకులకు కనువిందు చేస్తాయి. ఏడాది పొడవునా సందర్శించగల ఈ ప్రాంతం మన దేశీయులే కాకుండా విదేశీయులు కూడా సందర్శిస్తారు. గోవా గురించి వివరాలలోకి వెళితే..
పార్టీలు, కాసినోలు, ఎంజాయ్ మెంట్ కోసం స్నేహితులతో కలిసి చాలామంది గోవాకు విహారయాత్రకు వెళుతుంటారు. గోవా సహజ ప్రకృతి అందాలతో పాటు మరొక దానికి కూడా ప్రసిద్ధి చెందింది. అదేంటంటే బీర్. ఇక్కడ బీర్ చాలా చౌకగా దొరుకుతుందని చెబుతారు. అందుకే గోవాకు వెళ్లిన వారు బీరును మంచి నీళ్లలా తీసుకుంటూ ఉంటారు. అసలు బీర్ కోసమే చాలా మంది గోవాకు స్నేహితులతో వెళుతుంటారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గోవాలో బీర్ చాలా తక్కువ ధరలో దొరుకుతుంది. మామూలుగా అయితే బీర్ల ధర బ్రాండ్లపై, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఇతర రాష్ట్రాల కంటె సగటు 25 శాతం తక్కువ ధరలో దొరుకుతుంది. గోవాలో బీర్ చాలా తక్కువ ధర ఉండడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ప్రధాన కారణం ఇక్కడి పన్నుల విధానం. గోవాలో మద్యంపై పన్నుచాలా తక్కువగా ఉంటుంది.
మనదేశంలో మద్యం జీఎస్టీ పరిధిలోకి రానందున మద్యం ధరలు నిర్ణయించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషిస్తుంది. గోవాలో మద్యం టెండర్లు పొందడం చాలా సులభమైన పని. అందుకే అక్కడ మద్యం షాపులు చాలా ఉంటాయి. మద్యం ధర కూడా తక్కువగా ఉంటుంది. మద్యం ధరలు తక్కువ ఉండడంతో పర్యాటకులకు ప్రోత్సాహకంగా కూడా ఉంది. గోవాలో అనేక స్థానిక బీర్ బ్రాండ్లు ఉంటాయి. సాధారణంగా ఇవి తక్కువ రేటులో ఉంటాయి. మద్యం తయారీకి కావలసిన ముడిసరుకు కూడా ఇక్కడ సులభంగా దొరుకుతుంది. కాబట్టి వేరే రాష్ట్రాలతో పోలిస్తే గోవాలో మద్యం తక్కువ ధరలో దొరుకుతుంది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగానే కాకుండా గోవా బీరుకు కూడా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. మరి, గోవాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.