దేశంలో పెద్ద నోట్ల చెలామణి తర్వాత కొత్తగా రూ.500, రూ.2000 నోట్లు చలామణిలోకి వచ్చాయి. ఇటీవల ఏటీఎం లో రెండు వేల నోటు అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం రూ.2 వేల నోటు విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
దేశంలో పెద్ద నోట్ల చెలామణిపై గతంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసింది. ఆ నోట్ల స్థానంలో కొత్తగా రూ.500, రూ.2000 నోట్లు చెలామణిలోకి తీసుకు వచ్చింది. అప్పటికే సామాన్యుల వద్ద పాత నోట్లను బ్యాంకులలో మార్చుకోవడానికి నానా తిప్పలు పడ్డారు. తాజాగా రూ.2 వేల నోట్లు ఉపసంహరించుకుంటున్నామని ఆర్‌బీఐ సంచలన ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే..
రూ.2 వేల నోట్లపై రద్దు చేస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ నోట్లను సర్క్యూలేషన్ నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చని, డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. వీటిని మార్చుకునే ఆఖరు తేదీ 2023 సెప్టెంబర్ 30. రూ.2వేల నోట్లను సర్కులేషన్‌లో ఉంచొద్దని ఆర్‌బిఐ బ్యాంకులను ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. ఇక నుంచి వినియోగదారులకు రూ. 2వేల నోట్లు ఇవ్వడం నిలిపివేయాలని ఆర్‌బిఐ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు. మే 23 నుంచి ఆర్‌బీఐ రీజినల్ కార్యాలయాల్లో రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చని తెలిపింది. దేశ వ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2 వేల నోట్ల మార్పిడికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇకపై బ్యాంకు కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా నోట్లు మార్చుకోవాలని ఆర్బీఐ సూచించింది.
గతంలో డెమానిటైజేషన్ లో భాగంగా అప్పట్లో వాడుకలో ఉన్న రూ. 500, రూ. 1000 నోట్లను చెలామణి ఆపివేస్తున్నట్లు రాత్రి పూట పీఎం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రూ. 2 వేల పెద్ద నోటు చెలామణిలోకి వచ్చింది. ఇటీవల చాలా రాష్ట్రాల్లో నకిలీ రెండు వేల నోట్లు చెలామణిలోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే రూ.2 వేల నోట్ల ముద్రణ పూర్తిగి నిలిపి వేశామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. క్లీనో నోట్ పాలసీలో భాగంగా రూ.2 వేల నోట్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఒక విడతలో రూ.20 వేలు మాత్రమే మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు గా పేర్కొంది.
₹2000 Denomination Banknotes – Withdrawal from Circulation; Will continue as Legal Tenderhttps://t.co/2jjqSeDkSk
— ReserveBankOfIndia (@RBI) May 19, 2023