వేల కోట్ల ఆస్తులు, పదుల్లో కంపెనీలు ఎన్ని ఉన్నా ఇవేమీ తృప్తినివ్వని పేదవాడు అతను. అందుకే వేల కోట్ల ఆస్తులను, పదవులను వద్దనుకుని ఈ ప్రపంచానికి దూరంగా, సంతోషంగా గడుపుతున్నారు. అవును అతను అనుకుంటే రతన్ టాటాలా వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలచ్చు. కానీ ఆల్రెడీ ఒక టాటా ఉండగా మరో టాటా ఎందుకు అని చెప్పి ఆయన రిలాక్స్ అయ్యారు. అన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్న రతన్ టాటానే చాలా సింపుల్ గా ఉంటారనుకుంటే.. ఈయన తమ్ముడు నావల్ టాటా అంతకంటే సింపుల్ గా, అతి సామాన్యుడిలా జీవనం సాగిస్తున్నారు. ఈరోజుల్లో వేలు విలువ చేసే ఆస్తులు ఉంటేనే కొట్టుకు చస్తున్నారు. అలాంటిది వేల కోట్ల ఆస్తులను వదులుకుని ఉండడం అంటే మామూలు విషయం కాదు.
టాటా కంపెనీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. భారతదేశంలోనే అత్యంత విలువలు కలిగిన సంస్థగా పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకుంది. టాటా కంపెనీ అంటే గుర్తొచ్చేది రతన్ టాటానే. ఈయన ఎంత సాధారణంగా ఉంటారో అందరికీ తెలిసిందే. డ్రైవర్ తో కూడా కుటుంబ సభ్యుడిలా మాట్లాడడం గానీ, రోడ్డు మీద ఎవరైనా ఆసక్తిగా కనబడితే వారితో కలిసి ఛాయ్ తాగడం గానీ చేస్తూ సింప్లిసిటీని మెయింటెయిన్ చేస్తుంటారు. ఈయనే ఇలా ఉంటె ఈయన తమ్ముడు ఇంకా సింపుల్ గా ఉంటున్నారు. రతన్ టాటా సోదరుడు జిమ్మీ నావల్ టాటా.. మీడియా ప్రపంచానికి దూరంగా జీవిస్తున్నారు. రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. కానీ కుటుంబంతో మాత్రం చాలా సన్నిహితంగా ఉంటారు. ముఖ్యంగా ఆయన సోదరుడు జిమ్మీ నావల్ టాటాతో చాలా క్లోజ్ గా ఉంటారు.
ఈయన సోదరుడు రతన్ టాటాలా వ్యాపారవేత్తలా కాకుండా ప్రజల కంటికి, మీడియాకి దూరంగా ఉంటారు. విలాసవంతమైన జీవితాలకు దూరంగా చాలా నిరాడంబరంగా జీవిస్తున్నారు. రతన్ టాటా తమ కుటుంబ వ్యాపారాన్ని అందనంత ఎత్తుకి తీసుకెళ్లడంతో జిమ్మీ నావల్ టాటా.. అన్న మీదనే బాధ్యతలు పెట్టి తాను పూర్తిగా సింపుల్ గా జీవించడానికి ఇష్టపడ్డారు. వేల కోట్లను కాదని ముంబైలోని కోలబలో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో జీవనం సాగిస్తున్నారు. 90ల కాలంలో జిమ్మీ నావల్ తన తండ్రి టాటా ఆధ్వర్యంలో ప్రారంభమైన అనేక టాటా కంపెనీల్లో పని చేసి రిటైర్మెంట్ తీసుకున్నారు. అప్పటి నుంచి చిన్న ఫ్లాట్ లోనే సాధారణ జీవితం గడుపుతున్నారు.
ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. జిమ్మీ నావల్ టాటా ఫోన్ కూడా వాడరంట. సాధారణ జీవితం గడపడమే తనకు ఇష్టమని నావల్ టాటా చెప్పడంతో.. రతన్ టాటా కూడా తన తమ్ముడి మాటలకు విలువ ఇచ్చారు. ఇప్పటికీ ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు. ఇద్దరూ అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉంటారు. రతన్ టాటా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన తమ్ముడితో కలిసి 1945లో దిగిన ఫోటోను షేర్ చేశారు. అందులో ‘అవి చాలా సంతోషకరమైన రోజులు. మా మధ్య ఏమీ రాలేదు. 1945 జిమ్మీతో నేను’ అంటూ రాసుకొచ్చారు. మరి వేల కోట్ల ఆస్తులను కాదని సాధారణ జీవితం గడుపుతున్న జిమ్మీ నావల్ టాటాపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.