నగల దుకాణాల్లో చోరీలు జరగడం కామనే. దొంగలు ప్లాన్ చేసి మరీ గోల్డ్ షాప్స్‌లో చోరీలు చేస్తుంటారని విన్నాం. అయితే ఇలాంటి ఘటనల్లో ఎందరో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. కోర్టులు కూడా వీరికి శిక్షలు విధించి జైళ్లకు పంపాయి. అయినా ఇలాంటి దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. బంగారు ఆభరణాల దుకాణాల్లో లూటీలు జరుగుతూనే ఉన్నాయి. అంతెందుకు అప్పుడప్పుడు కొందరు దొంగలు వినియోగదారుల రూపంలో జ్యువెలరీ షాపులకు వెళ్లి చేతివాటం ప్రదర్శిస్తుండటాన్ని చూస్తూనే ఉన్నాం. మనుషులు దొంగతనాలు, లూటీలు చేయడం వినుంటారు. కానీ ఒక ఎలుక దొంగతనం చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా? కాస్త వింతగా, ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది నిజం.
ఒక గోల్డ్ షాప్‌లో చోరీ చేసిందో ఎలుక. ఏకంగా ఎంతో విలువైన డైమండ్ నెక్లస్‌ను ఎత్తుకెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఫన్నీగా ఉన్న ఈ వీడియో ఫుల్ వైరల్ అయింది. దీనిపై ఒక నెటిజన్ స్పందిస్తూ.. ‘తన గర్ల్ ఫ్రెండ్ కోసమే ఎలుక నెక్లస్‌ను తీసుకెళ్లిందేమో’ అని కామెంట్ చేశాడు. ‘భర్తయినా, ఎలుకైనా అందరి పరిస్థితి ఒకటే’ అంటూ మరో నెటిజన్ సరదాగా కామెంట్ చేశాడు. ఎలుక నెక్లస్‌ను దొంగతనం చేసిన ఘటనలో నిజానిజాలు ఏంటనేది ఇంకా తెలియదు. ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఆ నెక్లస్‌ను ఎలుక ఏం చేసిందనే దాని మీద స్పష్టత రాలేదు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#अब ये चूहा डायमंड का नेकलेस किसके लिए ले गया होगा…. 🤣🤣 pic.twitter.com/dkqOAG0erB
— Rajesh Hingankar IPS (@RajeshHinganka2) January 28, 2023