ఈ విశ్వంలో అద్భుతాలకు కొదవే లేదు. ఇప్పుడు ఆకాశంలో మరో అద్భుతం చోటుచేసుకోబోతోంది. మీకు తోక చుక్కలు తెలుసా? సాధారణంగా నక్షత్రాల మాదిరిగానే కనిపిస్తాయి. కాకపోతే కాస్త ఎక్కువ వెలుతురు, వేగంగా ప్రయాణిస్తూ ఉండటం చూసుంటారు. అయితే ఇప్పుడు ఆకాశంలో ఓ ఆకుపచ్చ తోకచుక్క దర్శనమివ్వనుంది. దీనిని గ్రీన్ కామెట్ అని పిలుస్తారు. ఈ తోకచుక్క భూమికి బాగా చేరువగా రాబోతోంది. అదికూడా రాతియుగం తర్వాత మళ్లీ ఇప్పుడే ఇలా జరగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తోకచుక్క అంటే వాయువులతో నిండిన అంతరిక్ష మంచు గోళాలు. ఇవి సాదారణంగానే పెద్దగా ఉంటాయి. వీటి వ్యాసం దాదాపు ఒక నగరం అంత ఉంటుంది. ఇవి ప్రయాణిస్తూ సూర్యుడికి దగ్గరగా వచ్చిన సమయంలో కాంతిని వెదజల్లుతూ ప్రకాశవంతంగా కనిపిస్తాయి. భూమిపై జీవం ఎలా ఏర్పడింది అనే విషయాన్ని కనుగొనడానికి శాస్త్రవేత్తలు వీటి సాయమే తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మాత్రం ఓ అరుదైన తోకచుక్క ప్రజలకు దర్శనం ఇవ్వబోతోంది. అది కూడా ఒకటి రెండు కాదు 50 వేల సంవత్సరాల తర్వాత మళ్లీ భూమికి చేరువగా రాబోతోంది. దీనిని గ్రీన్ కామెట్ అని పిలుస్తారు.
ఈ తోకచుక్కను గతేడాది మార్చి నెలలో శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి C/2022 E3 (ZTF)గా నామకరణం చేశారు. ఇది బుధవారం భూమికి 42 మిలియన్ కిలోమీటర్ల దూరానికి రాబోతుందని అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా వెల్లడించింది. ఇది ఫిబ్రవరి 1- 2 తేదీల్లో కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే దీనిని నేరుగా కంటితో చూడటం కాస్త కష్టమేనంటూ కోల్ కతా బిర్లా ప్లానిటోరియం వైజ్ఞానిక అధికారి తెలిపారు. ఇది కంటికి అంత క్లియర్ గా కనిపించే అవకాశం లేదంటున్నారు.
బైనాక్యులర్ తో అయితే కాస్త స్పష్టంగా కనిపించే అవకాశం ఉందంటున్నారు. బుధవారం రాత్రి 9.30 తర్వాత ఆకాశంలో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మీరు దీనిని చూడలేకపోతే మాత్రం మళ్లీ జీవితంలో చూడలేరంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే ఇది మళ్లీ భూమికి చేరువగా రావాలి అంటే మళ్లీ మిలియన్ సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఔత్సాహికులు, ఆకాశం, తోకచుక్కలు అంటే ఆసక్తి ఉండే వ్యక్తులు కచ్చితంగా దీనిని చూసే ప్రయత్నం చేయాలంటూ చెబుతున్నారు.
The green comet C/2022 E3 (ZTF) is zooming back past us after almost 50,000 years. On February 1st, the comet will come within 26 million miles of Earth before speeding away again, not returning for millions of years. pic.twitter.com/OruyZz0vaK
— BBC Earth (@BBCEarth) January 31, 2023