బెంగళూరులోని ఇందిరా నగర్ లో రామేశ్వరం కేఫ్ ఉంది. ఇది చూడటానికి చిన్న దుకాణంలాగా ఉన్నప్పటికి ఆ కేఫ్ లో కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఇది ఎలా సాధ్యపడింది. దీనికి వారు ఎంచుకున్న పద్దతులేంటి అనేది తెలుసుకుందాం..
చాలా మందికి ఉద్యోగం కంటే వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంటుంది. అయితే బిజినెస్ అనేది సవాళ్లతో కూడుకున్నదని భయ పడుతుంటారు.అంతేకాక ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతుంటాయి. వాటన్నింటిని తట్టుకుని వ్యాపారంలో ముందుకు సాగాలంటే ఖచ్చితమైన ప్రణాళికతోనే సాధ్యమవుతుంది. వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి కష్టపడే తత్వం, కస్టమర్లను ఆకర్షించే నైపుణ్యాలు ఉంటే చాలు. ఇదే తరహాలో బెంగళూరులోని ఇందిరా నగర్ లో రామేశ్వరం కేఫ్ ఉంది. ఇది చూడటానికి చిన్న దుకాణంలాగా ఉన్నప్పటికి ఆ కేఫ్ లో కోట్ల వ్యాపారం జరుగుతోంది. మరి.. ఆ వ్యాపారానికి సంబంధించిన వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
చదువుకున్న వారు, చదువులేని వారు ప్రతిఒక్కరు వ్యాపారంలో రాణించవచ్చు. నేటి యువత చదువు అయిపోయిన తరువాత ఉద్యోగం కంటే వ్యాపారం చేయడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. జీవితంలో ఆర్థికంగా ఎదగాలంటే వ్యాపారం ద్వారానే అది సాధ్యమవుతుందని విశ్వసిస్తున్నారు. ఇలా ఆలోచించే రాఘవేంద్ర రావు అనే వ్యక్తి ‘రామేశ్వరం కేఫ్’ ను ఏర్పాటు చేశారు. ఈయనకు ఫుడ్ బిజినెస్ లో 20ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆయనకు ఎపీజె అబ్ధుల్ కలాం అంటే ఎనలేని అభిమానం, ప్రేమ. దీంతో కలామ్ జన్మించిన రామేశ్వరం ఊరి పేరుతో రామేశ్వరం కేఫ్ ను బెంగళూరులో 2021లో ప్రారంభించారు. అయితే ఈ కేఫ్ లో రోజుకు 7500 మందికి సర్వ్ చేస్తుంటారు.
క్విక్ సర్వీస్ రెస్టారెంట్ పేరుతో ఈ కేఫ్ నెలకు రూ.4.5కోట్లతో ఏడాదికి రూ.50కోట్ల వ్యాపారం జరుగుతోంది. రామేశ్వరం కేఫ్ ద్వారా దక్షిణ భారత రుచులను దేశం అంతా విస్తరించాలనేది తమ లక్ష్యమని రాఘవేంద్రరావు చెప్పారు. బెంగళూరుతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో వ్యాపారం విస్తరించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. రామేశ్వరం కేఫ్ లో వడ, మిని వడ, ఇడ్లీ, నెయ్యి.. బటర్ ఇడ్లీ, నెయ్యి పుడి ఇడ్లీ, లెమన్ ఇడ్లీ, నెయ్యి సాంబార్ ఇడ్లీ, వెన్ పొంగల్, సక్కరై పొంగల్ తో పాటు ఇతర ఆహార పదార్థాలను రుచి చూడవచ్చు. ప్రపంచంలోని ఫుడ్ లవర్స్ ఈ కేఫ్ లోని ఫుడ్ ఐటెమ్స్ ని ఎక్కువగా ఇష్టపడతారు.