దేశంలో ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా సమయంలో లాక్ డౌన్ ఉండటం వల్ల ప్రమాదాల సంఖ్య కాస్త తగ్గినా.. ఇప్పుడు మళ్లీ పెరిగిపోయాయి. రోడ్డు భద్రతాచర్యలు ఎంత కఠినంగా వ్యవహరించినా డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు సంబవిస్తున్నాయి. రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని జీపు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే కన్నుమూశారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
ఝుంఝును- గూడా గాడ్జీ హైవే పైని ఈ ఘోర సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితులు అంతా దేవాలయంలో ప్రార్ధనలు చేసి తిరిగి వస్తున్న సమయంలో అదుపు తప్పి ట్రాక్టర్ ట్రాలీని జీపు ఢీ కొట్టింది. ఈ ఘటనలో పది మంది సంఘటన స్థలంలోనే చనిపోగా ఏనిమిది మంది క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విషయం తెలుసుకున్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. మరణించినవారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.