కూల్‌డ్రింక్‌లు మన నిత్య జీవితంలో భాగం అయ్యాయి. వేసవి కాలంలో వీడి వినియోగం మరింత ఎక్కువ. ఈ రంగు నీళ్లు ఆరోగ్యానికి మంచివి కాదన్నా ఎవరు వినడం లేదు. ఇక తాజాగా ప్యాక్ చేసిన కూల్‌డ్రింక్‌లకు సంబంధించి షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
ఈమధ్యకాలంలో మనం ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలు కాదని.. రెడీమేడ్‌గా ఉన్న తిండి తింటూ.. ఇంటిని, ఒంటిని గుల్ల చేసుకుంటున్నాం. ఇక వేసవి కాలంలో ఇళ్లల్లో ఫ్రిజ్‌ల నిండా కూల్‌డ్రింక్ బాటిల్లు, టిన్‌లు, డబ్బాలు దర్శనమిస్తాయి. పసిపిల్లలు మొదలు పండు ముసలి వాళ్ల వరకు ఈ కూల్ డ్రింక్‌లకు అలవాటు పడ్డారు. బాగా దాహం వేస్తే.. మంచి నీళ్లు బదులు.. రంగు నీళ్లు తాగుతూ.. లేనిపోని రోగాలు కొని తెచ్చుకుంటున్నాం. కూల్‌డ్రింక్స్‌లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది.. ఆరోగ్యానికి మంచిది కాదు అని ఎంత మొత్తుకున్నా వినడం లేదు. ఎగబడి మరీ కొనుక్కుంటున్నాం. ఇక తాజాగా ఓ కుటుంబం ఎండ వేడికి తాళలేక.. స్థానిక కిరాణ దుకాణంలో మాజా, మరో కూల్ డ్రింక్ కొనుగోలు చేసింది. మాజా బాటిల్, సీసా కాకుండా చిన్న ప్యాక్‌లో ఉన్నది కొనుగోలు చేశారు. దాన్ని ఒపెన్ చేద్దాము అంటే ఏవో వింత శబ్దాలు వినిపించాయి. భయపడి కిరాణ దుకాణం దగ్గరకు తీసుకెళ్లి.. ఒపెన్ చేయగా.. ఏం జరిగిందో మీరే చదవండి.
ఈ సంఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది. ప్యాక్ చేసిన మాజా డబ్బాలో.. బతికున్న జెర్రీ వెలుగు చూడటం స్థానికంగా కలకలం రేపుతోంది. దుంగార్ పూర్ జిల్లా, పూజ్‌పూర్‌లో ఒక యువకుడు తన కుటుంబంతో కలిసి స్థానికంగా ఉన్న షాపులో మాజా డబ్బా, ఇతర కూల్‌డ్రింక్‌లు కొనుగోలు చేశారు. ఇంటికి వెళ్లాక.. మాజా తాగుదామని.. ప్యాకెట్ ఒపెన్ చేద్దామనుకునే సరికి దాన్నుంచి ఏదో వింత శబ్దం వచ్చింది. ముందు భయపడ్డ యువకుడు వెంటనే దాన్ని ఒపెన్ చేయకుండా.. తిరిగి షాపుకి తీసుకెళ్లాడు. అప్పుడు షాపు యజమానితోనే మాజా ప్యాకెట్‌ను కట్ చేయించి ఓపెన్ చేయించాడు.
దాంతో షాకింగ్ దృశ్యం వెలుగులోకి వచ్చింది. మాజా ప్యాకెట్‌ను కట్ చేసి.. జ్యూస్‌ను ఒక ప్లేట్‌లో పోశారు. ఇంకేముంది దాన్నుంచి జ్యూస్‌తో పాటు.. బతికున్న జెర్రీ ఒకటి బయటకు వచ్చింది. దీన్నంతటిని సదరు యువకుడు వీడియో తీశాడు. ప్యాక్ చేసిన జ్యూస్‌లోకి ఆ జెర్రి ఎలా వెళ్లిందో తెలియడం లేదన్నాడు షాపు యజమాని. ఇక సదరు యువకుడు ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసి నెటిజనులు భయపడుతున్నారు. వామ్మో.. ఇలాంటి జ్యూస్‌లు తాగాలంటే.. భయమేస్తోంది కదా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.