వైద్యుడిని భగవంతుడిగా చూసే సమాజం మనది. అయితే అప్పుడప్పుడు కొందరు వైద్యులు నిర్లక్ష్య ధోరణి కారణంగా రోగుల ప్రాణాల మీదకు వచ్చే పరిస్థితులు తలెత్తుంటాయి. తాజాగా రాజస్తాన్‌లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. గర్భణీకి చికిత్స చేస్తుండగా.. ఆమె మృతి చెందింది. బాధితురాలి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు సదరు వైద్యురాలి మీద కేసు నమోదు చేశారు. మనస్తాపానికి గురైన వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది. ఆ సంఘటన వివరాలు..
ఇది కూడా చదవండి: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయం.. ఈసారి ప్రైవేట్ స్కూల్స్ పై..!
రాజస్తాన్, దౌసా జిల్లాకు చెందిన డాక్టర్ అర్చనా శర్మ.. ఆమె భర్తతో కలిసి ఓ ప్రైవేట్ ఆస్పత్రిని నడుపుతున్నారు. ఈ క్రమంలో బాధిత గర్భిణీ మహిళ వైద్యం నిమిత్తం సోమవారం అర్చన ఆస్పత్రికి వచ్చింది. సిజేరియన్ చేస్తుండగా దురదృష్టవశాత్తు గర్భిణీ మృతి చెందింది. అర్చన నిర్లక్ష్యం కారణంగానే గర్భిణీ మహిళ మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపించారు. డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలిందిగా డిమాండ్ చేస్తూ నిరసన తెలపడమే కాక.. అర్చనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామంతో తీవ్రంగా కలత చెందిన డాక్టర్ అర్చన.. మంగళవారం తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్ కలకలం రేపుతుంది. దీనిలో అర్చన తాను నిర్దోషిని అని.. అది నిరూపించడానికి తన చావే సాక్ష్యం అని.. ఇక మీదటనైనా అమాయక డాక్టర్లను వేధించడం మానుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ఇది కూడా చదవండి: అసెంబ్లీలో స్పీకర్ పై కుర్చీ ఎత్తిపడేసిన ఎమ్మెల్యే!అర్చన ఆత్మహత్యపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా బుధవారం వైద్య సేవలను నిలిపివేయాలని పిలుపునిచ్చారు. అంతేకాక ఈ సంఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వృత్తిపరమైన విధుల్లో ఉన్నప్పుడు వైద్యులపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయరాదని.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో ఉందని ప్రైవేట్ హస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ సొసైటీ సెక్రటరీ డాక్టర్ విజయ్ కపూర్ తెలిపారు. ఈ ఘటనలో వైద్యురాలు సహా ఆమె కుటుంబం తీవ్ర మనోవేదనకు గురయ్యారని.. అందుకే అర్చన ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుందని తెలిపారు. బాధ్యులైన పోలీస్ అధికారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అర్చన మృతికి న్యాయం జరిగే వరకు పోరాడతాం అని తెలిపారు.
ఇది కూడా చదవండి: మోడల్ ఆత్మహత్యా యత్నం.. హోటల్ ఆరో అంతస్తు నుంచి
ఈ సంఘటనపై ప్రభుత్వం స్పందించింది. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. అంతేకాక ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. ‘‘డాక్టర్ అర్చన ఆత్మహత్య విచారకరం. రోగుల ప్రాణాలను కాపాడటానికి డాక్టర్లు తమ శాయశక్తుల ప్రయత్నిస్తారు. కానీ అప్పుడప్పుడు ఇలాంటి దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. అలాంటప్పుడు వైద్యులను నిందించడం సరికాదు’’ అని గెహ్లాట్ ట్వీట్ చేశారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.