భర్త ఏదో నేరం చేసి జైలుకెళ్లాడు. ఇలాంటి సమయాల్లో భార్య.. అతడి కోసం ఎదురు చూస్తూ ఇటు పుట్టింటిలోనో.. లేక అత్తింటిలోనో గడుపుతుంది. భర్తలో మార్పు రావాలని కోరుకుంటుంది. కానీ ఇప్పుడు మీరు చదవబోయే కథనం అందుకు పూర్తి విరుద్ధం. భర్త జైలులో ఉన్నాడు. భార్యకేమో పిల్లల్ని కనాలని కోరికగా ఉంది. దాంతో మాతృత్వం పొందే హక్కు తనకుందని.. కానీ భర్త జైలులో ఉండటం వల్ల అది సాధ్యం కావడం లేదని.. కనుక తన భర్తకు పెరోల్ ఇస్తే బిడ్డను కంటానని కోర్టును అభ్యర్థించింది. ఈ పిటిషన్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా.. ప్రస్తుతం కోర్టు ఇచ్చిన తీర్పు మరింత ఆశ్చర్యకరంగా ఉంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం యువకుడి సాహసం..
రాజస్తాన్‌కు చెందిన నందలాల్ అనే వ్యక్తికి భిల్వారా కోర్టు 2019లో జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం అతడు జైలులో ఉంటున్నాడు. అయితే శిక్ష పడటానికి కొద్ది కాలం ముందే నందలాల్‌కి రేణు అనే మహిళతో వివాహం అయ్యింది. పెళ్లైన కొద్ది రోజులకే నందలాల్ అరెస్ట్ అయ్యాడు. ఈ క్రమంలో రేణు సంతానం పొందేందుకు తనకున్న హక్కును వినియోగించుకునేందుకు తన భర్తను విడుదల చేయాల్సిందిగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఇది కూడా చదవండి: రూ.11 కోట్ల విలువైన చిల్లర మాయం….!జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఫర్జాంద్ అలీల ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి.. నందలాల్‌కు 15 రోజుల పెరోల్ ఇవ్వడానికి అంగీకరించారు. ఈ సందర్భంగా ‘‘నందలాల్ భార్య అమాయకురాలు. భర్త జైలులో ఉండటం వల్ల.. వైవాహిక జీవితంతో ముడిపడ్డ శృంగార, భావోద్వేగ అవసరాలు ఆమెకు దూరమయ్యాయి. సంతానం పొందే హక్కు ఖైదీకి ఉంటుంది. ఆయా కేసుల్లోని వాస్తవాలు, పరిస్థితులపై ఇది ఆధారపడి ఉంటుంది’’ అని ధర్మాసనం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. నందలాల్‌కు పెరోల్ మంజూరు చేస్తూ.. తీర్పు వెల్లడించింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.