ఆడ పిల్లలు పుడితే భారమనుకుంటున్నఈ రోజుల్లో వారిని పెంచి పెద్ద చేయడమే గొప్ప అనుకుంటున్నారు తల్లిదండ్రులు. ఇక వారి చదువుకు రూపాయి కూడా ఖర్చు పెట్టలేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఈ దేశంలో. పెళ్లి చేసేంత వరకు
ఆడ పిల్లలు పుడితే భారమనుకుంటున్నఈ రోజుల్లో వారిని పెంచి పెద్ద చేయడమే గొప్ప అని భావిస్తారు తల్లిదండ్రులు. ఇక వారి చదువుకు రూపాయి కూడా ఖర్చు పెట్టలేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఈ దేశంలో. పెళ్లి చేసేంత వరకు ఇంట్లో తల్లికి పనుల్లో సాయం చేస్తూ, ఇంటికి చాకిరి చేస్తూ ఉండిపోవాలి. లేదంటే ఏదైనా పని చేసి ఇంటికి ఇవ్వాలి. ఆకాశంలో సగం, అన్నింటా సగం చెప్పుకోవడానికే.. ఆచరణీయంలో మాత్రం ఆమడ దూరంలో ఆగిపోతుంది ఆడ పిల్ల. ఎప్పటికైనా ‘ఆడ’పిల్లే కదా అని.. తూతూ మంత్రంగా, చాలా సింపుల్ గా పెళ్లిళ్లు చేస్తున్నారు. ఇక కట్నం చదివించుకోలేని తల్లిదండ్రులైతే కూతుర్ని వృద్ధుడికే, విభిన్న ప్రతిభావంతులకో ఇచ్చి పెళ్లి చేస్తున్నారు.
పిల్లికి బిచ్చమొయ్యని, కాకికి మెతుకులు కూడా విసరని ఈ రోజుల్లో.. పేద ఇంటి అమ్మాయి పెళ్లి చేసి శభాష్ అనిపించుకుంటున్నారు రాజస్తాన్‌కు చెందిన కానిస్టేబుల్. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన ఓ యువతి పెళ్లి సమయంలో అండగా నిలిచాడు ధరమ్‌వీర్ జాఖర్ అనే ఓ కానిస్టేబుల్. వివరాల్లోకి వెళితే.. టెట్రా గ్రామంలోని మండవలోని ఝుంఝును జిల్లాకు చెందిన అమ్మాయికి తల్లిదండ్రులు వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే పెళ్లి చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని, అంత డబ్బు అతని వల్ల లేకపోవడంతో పాటు అనారోగ్య సమస్యలు వెంటాడుతుండటంతో పెళ్లి ఎలా చేయాలని ఆందోళన చెందుతున్నారు. వారి కష్టాలను గుర్తించిన కానిస్టేబుల్ .. వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.
వీరి బాధలను సోషల్ మీడియాలో చెప్పడం ప్రారంభించారు. ఈ కుటుంబానికి అండగా నిలవాలంటూ సాయం కోరాడు. అయితే అతడి విన్నపానికి భారీ స్పందన లభించింది. రిఫ్రిజిరేటర్, కూలర్, ఫ్యాన్, బెడ్, ఇంటి సామాన్లు వంటి వస్తువులు సమకూరాయి. రూ. లక్షా 31 వేలు సేకరించాడు. దీంతో పాటు అతడు ఒక్కడే రూ. 61 వేలు వారి కుటుంబానికి అందించాడు. అలాగే వధువుకు సోదరుడి పాత్ర పోషించి.. అమ్మాయి పెళ్లిలో సంప్రదాయ పద్ధతులను చేపట్టాడు. సమాజం పట్ల కాస్త దయతో వ్యవహరించాలని కానిస్టేబుల్ కోరారు. కానిస్టేబుల్ చేసిన పనికి వధువు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేయగా.. ఆ పెళ్లికి వచ్చిన వారంతా అతడిని అభినందించారు.