చాలా మంది రైళ్లలో ప్రయాణం చేయడంపై ఆసక్తి చూపిస్తుంటారు. బస్సు జర్నీలతో పోలిస్తే.. రైల్లో జర్నీ చాలా సౌకర్యంగా ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. అలానే తమ వెంట పెంపుడు జంతువులను తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఈ జంతువుల విషయంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
చాలా మంది రైళ్లలో ప్రయాణం చేయడంపై ఆసక్తి చూపిస్తుంటారు. బస్సు జర్నీలతో పోలిస్తే.. రైల్లో జర్నీ చాలా సౌకర్యంగా ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. అలానే తమ వెంట పెంపుడు జంతువులను తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. అయితే పెంపుడు జంతువులను రైల్లో తీసుకెళ్లాలంటే పార్సిల్ కౌంటర్ వద్ద ప్రత్యేకంగా ఓ టిక్కెట్ తీసుకోవాల్సి ఉండేది. ఇప్పటి వరకు జంతువుల విషయంలో ఇలానే జరిగేది. అయితే తాజాగా ప్రయాణికులు తమ పెంపుడు జంతువులను రైళ్లలో తీసుకెళ్లే ప్రక్రియను రైల్వేశాఖ మరింత సులభతరం చేసేందుకు సిద్ధమైంది.
ఇప్పటి వరకు పెంపుడు జంతువుల కలిగిన ప్యాసెంజర్లు మొదటి తరగతి ఏసీ బోగీలో ప్రయాణించేందుకు మాత్రమే అనుమంతించే వారు. ఇందుకోసం ప్రయాణ తేదీ రోజున స్టేషన్ లోని పార్సిల్ కౌంటర్ వద్దకు వెళ్లి పెంపుడు జంతువుల కోసం టికెట్ బుక్ చేసుకోవాలి. అలానే రెండవ తరగతి లగేజ్ లేదా బ్రేక్ వ్యాన్ లో ఒక బాక్స్ లో పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు అనుమంతించే వారు. అయితే ఈ విధానమంతా ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ విషయంపై రైల్వేశాఖ ఏమైన మార్పులు చేయాని కొందరు వినతి పత్రాలు సైతం ఇచ్చారు.
ఈక్రమంలనే రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ కొత్తగా పెంపుడు జంతువులకు కూడా ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యాన్ని కల్పించే విషయంపై పరిశీలిస్తోంది. ఈ మేరకు ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లో మార్పులు చేయాలని రైల్వేశాఖ కేంద్ర రైల్వే సమాచార సాంకేతిక వ్యవస్థకు సూచించినట్లు సంబంధింత వర్గాలు వెల్లడించాయి. ఈ నింబధన ఏనుగులు , గుర్రాలు, కుక్కలు, పిల్లులు, పక్షులు వంటి పెంపుడు జంతువులకు వర్తిస్తుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మార్పులు చేసిన తర్వాత ప్రయాణికులు తమ పెంపుడు జంతువుల కోసం ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
కానీ ప్రయాణికులు తమతో పాటు పెంపుడు జంతువులను రైళ్లలో తీసుకెళ్లేందుకు కొన్ని షరతులు ఉన్నాయి . ఫస్ట్ క్లాస్ ఏసీ టైర్ కోచ్‌లోని 2 లేదా 4 బెర్త్‌ల కూపేల్లో మాత్రమే పెంపుడు జంతువులను అనుమతిస్తారు. మొదటి చార్ట్ తయారైన తర్వాతే ప్రయాణికులు తమ పెంపుడు జంతువుల కోసం ఆన్ లైన్ ద్వారా పెంపుడు జంతువులకు టికెట్లు రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం వారి ప్రయాణ టికెట్‌ను తప్పనిసరిగా ధృవీకరించాలి. మరి.. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.