ఏ పరిశ్రమలోనైనా, ఏ రంగంలోనైనా ఉద్యోగులది కీలక పాత్ర. ఇక ప్రభుత్వాలు సమర్థవంతంగా నడవాలి అంటే అన్ని రంగాల్లోని ఉద్యోగులు శక్తికి మించి పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే వారి పనికి తగ్గట్లుగా జీతాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వారి వారి ఆర్థిక పరిస్థితులను బట్టి రాష్ట్రాల్లో ఉద్యోగుల జీతాల్లో తేడాలు ఉంటాయి. ఇక ఉద్యోగులు సంతృప్తిగా, సంతోషంగా జాబ్ చేయాలి అంటే వారి పనికి తగిన జీతం వారికి ఇవ్వాలి. ఈ నేపథ్యంలోనే 80 వేల మంది ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఉద్యోగుల మధ్య పోటీ పెంచేందుకు, వారు మరింత ఉత్సాహాంగా పనిచేసేందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఏకంగా 80 వేల మంది రైల్వే ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. దాంతో ఇండియన్ రైల్వేస్ కు చెందిన సూపర్ వైజర్ కేడర్ కు చెందిన ఉద్యోగులు.. గ్రూప్ A అధికారులకు సమానమైన వేతనాలు అందుకునే వీలుంది. అయితే ప్రస్తుతం లెవెల్ 7 కు చెందిన ఉద్యోగులకు జీతాల పెంపు, ప్రమోషన్లకు ఆస్కారం తక్కువగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. జీతాలు పెంచితే ఉద్యోగస్తులు మరింత ఉత్సాహాంతో పనిచేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ పెంపుతో 40 వేల మంది సూపర్ వైజర్ కేడర్ సిబ్బందికి లబ్ది చేకూరనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
ఈ క్రమంలోనే జీతాల పెంపుతో ఇండియన్ రైల్వేకు అదనంగా రూ.10 వేల కోట్ల భారం పడనుంది. అయితే ఈ భారాన్ని డిజిల్ బిల్లు ఆదా చేయడం ద్వారా భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఫీల్డ్ లెవెల్ ఉద్యోగుల సగటు వేతనంలో రూ. 2500 నుంచి 4 వేల రూపాయల వరకు జీతం పెగనుందని పేర్కొన్నారు. గత 16 ఏళ్లుగా సూపర్ వైజర్ కేడర్ కు సంబంధించిన ఒకే ఒక్క డిమాండ్ వినిపిస్తోందని, అదే ప్రమోషన్లకు సంబంధించిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అందుకే వారికి గ్రూప్ బీ ఎగ్జామ్ పెట్టి వారిని లెవెల్ 7 నుంచి లెవెల్ 8 చేర్చాలని అన్నారు. ఇలా చేస్తే 50 శాతం ఉద్యోగులు, సుమారు 3 వేల మందికి పైగా ప్రమోషన్లు పొందే ఆస్కారమున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ క్రమంలోనే ఇటీవల దసరా, దీపావళి పండుగలకు కేంద్ర ప్రభుత్వం రైల్వే ఎంప్లాయిస్ కు బోనస్ అందించిన సంగతి తెలిసిందే.
Thanks to PM @narendramodi Ji for giving opportunities for promotion to 80,000 supervisors of @RailMinIndia. pic.twitter.com/XWmZe7dA5E
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) November 17, 2022