సమాజంలో కొందరిని చూస్తుంటే అసహ్యం వేస్తుంటుంది. కారణం.. వారు మంచి ఉద్యోగంలో ఉండి కూడా సామాన్యుల నుంచి డబ్బులను దండుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కొందరు ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ.. ఆ జీతం సరిపోదన్నట్లు అక్రమ సంపాదన కోసం తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఓ రైల్వే క్లర్క్ కూడా తన దొంగ బుద్ధిని చూపించాడు. టికెట్ కోసం వచ్చే ప్రయాణికుడిని దారుణంగా మోసం చేశాడు. ప్రయాణికుడు ఇచ్చిన రూ.500 నోటును తీసుకుని రూ.20 నోటు టేబుల్ పై ఉంచాడు. అంతేకాక టికెట్ కోసం ఇంకా రూ.125 ఇవ్వమని ప్రయాణికుడి అడిగాడు. దీంతో ఒక్కసారిగా సదరు ప్రయాణికుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘రైల్ విస్పర్స్’ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి..మోసాన్ని వెలుగులోకి తెచ్చారు. మంగళవారం ఢిల్లీలోని హజ్రత్ నిజామూద్దీన్ రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి గ్వాలియర్ వెళ్లేందుకు టికెట్ ఇవ్వాలని కోరాడు. అందుకుగాను సదరు ప్రయాణికుడు టికెట్ కౌంటర్ లో ఉన్న వ్యక్తికి రూ.500 నోటు ఇచ్చాడు. అయితే ప్రయాణికుడిని మాటలతో మభ్యపెట్టిన సదరు రైల్వే క్లర్క్ రూ.500 నోటును జేబులో వేసుకుని..రూ.20 నోటును బయట తీసి ముందు ఉంచాడు. ఈక్రమంలో ప్రయాణికుడి ముందు రూ.20 నోటు ఉంచి.. గ్వాలియర్ టిక్కెట్ ఈ డబ్బులు సరిపోవని, ఇంకా రూ.125 ఇవ్వమని కోరాడు. దీంతో ప్రయాణికుడు ఒకసారిగా కంగుతిన్నాడు. తాను రూ.500 నోటు ఇచ్చినట్లు క్లర్క్ కి తెలిపాడు.
ఈ క్రమంలో వారిద్దరి మధ్య కొద్ది సమయం పాటు చిన్నపాటి వాదన జరిగింది. ‘రైల్ విష్పర్స్’ అనే ట్విట్టర్ హ్యండిల్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయి.. చివరకు రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వారు కూడా వెంటనే స్పందించి.. సంబంధిత టికెట్ బుకింగ్ క్లర్క్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ వీడియోపై చాలా మంది నెటిజన్లు స్పందించారు. చెన్నైలో తనకు ఇలా చాలాసార్లు జరిగిందని కొంతమంది రైల్వే ఉద్యోగుల సంఘటితగా ఉండి అటువంటి నేరాలలో మునిగిపోయేలా వారికి ధైర్యాన్ని ఇస్తుందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. మరొకరు స్పందిస్తూ.. సదరు క్లర్క్ చేసిన పని చాలా ప్రమాదకరమని, తాను ఇలాంటి మాయాజాలాన్ని మొదటిసారి చూస్తున్నానని తెలిపాడు.
#Nizamuddin station booking office
Date 22.11.22
Rs 500 converted into Rs 20 by the booking clerk.@GM_NRly @RailwayNorthern @drm_dli @RailMinIndia @AshwiniVaishnaw @IR_CRB @RailSamachar @VijaiShanker5 @PRYJ_Bureau @kkgauba @tnmishra111 @AmitJaitly5 pic.twitter.com/SH1xFOacxf— RAILWHISPERS (@Railwhispers) November 24, 2022